Homeట్రెండింగ్ న్యూస్Love Story: డబ్బు లేదని అతడిని వదిలేసింది.. 12 ఏళ్ల తర్వాత అతడు ఇలా ఎదురు...

Love Story: డబ్బు లేదని అతడిని వదిలేసింది.. 12 ఏళ్ల తర్వాత అతడు ఇలా ఎదురు పడ్డాడు.. ఏమైందో తెలుసా?

Love Story: ఎదుటి వారి పరిస్థితిని చూసి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం కంటే పెద్ద పొరపాటు ఏదీ లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఊహించలేం. టాలెంట్‌కు అదృష్టం తోడైతే ఊహించని మార్పులు జరుగవచ్చు. అడుక్కు తినేవాడు కోటీశ్వరుడు కావొచ్చు. దొంగ ఉన్నత అధికారిగా ఎదగవచ్చు. లెక్కలేనంత సంపద సొంత కావొచ్చు.. ఇలా ఏదైనా జరుగవచ్చు. తలరాత బాగా లేకుంటే.. సంపన్నుడు కూడా బికారిగా మారిపోవచ్చు. ఇవాళ మన దగ్గర కేవలం పది రూపాయలు మాత్రమే ఉంటే, రేపు కూడా మన దగ్గర పది రూపాయలు మాత్రమే ఉంటాయి అని అనుకోకూడదు. పరిస్థితులు మారి రేపు వందలు, వేలు, లక్షలు, కోట్లు కూడా కావచ్చు. ఈ కథ చదివితే ఒక మనిషి భవిష్యత్తుపై ఇవాల్టి పరిస్థితిని చూసి ఒక అంచనాకు రావడం ఎంత తప్పు అనేది అర్థమవుతుంది.

క్లాస్‌మేట్‌ను ప్రేమించి..
ఒక అబ్బాయి కాలేజీలో చదువుతున్న సమయంలో తన క్లాస్‌ మేట్‌ అయిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ముందు ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి భయపడ్డాడు. తర్వాత ధైర్యం చేసి ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పేశాడు. ఈ విషయం విన్న తర్వాత ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అనే కారణంతో రిజెక్ట్‌ చేసింది. తర్వాత కాలేజ్‌ అయిపోయింది. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఒకరితో ఒకరికి కాంటాక్ట్‌ కూడా లేదు.

12 ఏళ్ల తర్వాత..
12 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక షాపింగ్‌ మాల్‌లో ఆ అమ్మాయి షాపింగ్‌ చేస్తోంది. అంతలో అటు వైపు నుంచి వెళ్తున్న వ్యక్తి తనకు తెలిసినట్టుగా అనిపించింది. 12 సంవత్సరాల క్రితం తనకు ప్రపోజ్‌ చేసిన తన క్లాస్‌మేట్‌ అతనే అని గుర్తుతెచ్చుకున్న ఆ అమ్మాయి వెళుతున్న వ్యక్తిని పిలిచింది. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి వెళ్లి వ్యక్తిని పలకరించి, ‘ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? ఇంకా అలానే ఉన్నావా?’ అని వెటకారంగా అడిగింది. అందుకు ఆ వ్యక్తి నవ్వి, ‘నువ్వేం చేస్తున్నావు?’ అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి ‘ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు పెళ్లయింది. నా భర్త కూడా ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు’ అని చెప్పింది. అంతలోపు తన భర్త వచ్చాడు. ‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’ అని అమ్మాయిని అడిగాడు. దానికి ఆ అమ్మాయి జవాబు ఇచ్చేలోపే అవతలివైపు ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘మీరేంటి ఇక్కడ?’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు ఆ అమ్మాయి ‘ఇతను నీకు తెలుసా?’ అని అడిగింది.

షాక్‌ అయిన అమ్మాయి..
‘తెలుసు. ఈయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఇండియాలో చాలా చోట్ల ఈయన కంపెనీ బ్రాంచెస్‌ ఉన్నాయి. ఈయన స్పీచెస్‌ యూట్యూబ్‌ లో చాలాసార్లు చూశాను. మా బాస్‌ కూడా ఈయనని చాలా అభిమానిస్తారు. ఎంతో మందిని ఇన్‌స్పైర్‌ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా చాలా సార్లు ఈయన మాటలు విని ఇన్‌ప్పైర్‌ అవుతూ ఉంటాను’ భర్త చెప్పిన సమాధానం విని భార్య షాక్‌ అయింది. ఈ మాటలన్నీ విన్న ఆ వ్యక్తి ‘థాంక్యూ’ అని చెప్పాడు. అందుకు అమ్మాయి భర్త ‘గ్లాడ్‌ టు మీట్‌ యు సర్‌’ అని చెప్పాడు. ఆ వ్యక్తి ‘బై’ అని చెప్పి వెళ్లిపోయాడు.

వదులు కోవడం వల్లే ఇలా..
బహుశా అమ్మాయిని ప్రపోజ్‌ చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదేమో, కానీ తర్వాత మారింది. ఇలా ఎదుటి వ్యక్తి పై ఒక అంచనాకు రావడం ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకా చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటాయి. పరిస్థితులు మారుతాయని, ఒక మనిషి ఇవాళ ఉన్న పరిస్థితిని చూసి భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయానికి రాకూడదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమ్మాయి వెంటపడి ఉంటే అతను కోటీశ్వరుడు కాలేకపోయేవాడు.. ఆమెను వదిలేయడంతో దరిద్రం పోయింది… అమ్మాయిల వెంట తిరిగితే టైం వేస్టు తప్ప ఏమీ ఉండదు.. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular