Hyper Aadi: బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది లేటెస్ట్ కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. నేను జబర్దస్త్ మానేయడానికి ఆమెనే కారణం అంటూ ఆయన కొత్త యాంకర్ సౌమ్యరావుని పాయింట్ అవుట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఇదంతా రివర్స్ లో జరిగింది. ఈ వివాదం చుట్టూ జరిగిన సంఘటనలు పరిశీలిస్తే.. అనసూయ జబర్దస్త్ మానేశాక రష్మీ గౌతమ్ ఆమె స్థానంలోకి వచ్చారు. కొద్ది వారాలు రష్మీ జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించారు. మల్లెమాల వాళ్ళు కన్నడ అమ్మాయి సౌమ్యరావును జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు. దీంతో రష్మీ యధావిథిగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితమయ్యారు.
జబర్దస్త్ లో హైపర్ ఆదిదే హవా. అతని స్కిట్స్ కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో అతడు షోని శాసిస్తాడు. ఎవరిపైనైనా ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తాడు. తనకంటే సీనియర్ అనసూయనే ఆది అల్లాడించేశాడు. ఇక సౌమ్యరావుని కూడా అదే రేంజ్ లో ఆడుకోవడం మొదలుపెట్టాడు. హైపర్ ఆది సెటైర్స్ కి కౌంటర్ ఇద్దామన్నా… సౌమ్యరావుకి భాష రాదు. ఆమెపై హైపర్ ఆది సెటైర్స్ దాడి కొనసాగుతుంది.
ఈ క్రమంలో సౌమ్యరావు జబర్దస్త్ మానేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. హైపర్ ఆది వేధింపులను తట్టుకోలేక సౌమ్యరావు అగ్రిమెంట్ బ్రేక్ చేసుకొని వెళ్లిపోయారని పుకార్లు వినిపించాయి. హైపర్ ఆది కారణంగా సౌమ్యరావు షో మానేశారంటూ ప్రచారం జరుగుతుండగా… నేను జబర్దస్త్ మానేయడానికి సౌమ్యరావునే రీజన్ అని హైపర్ ఆది చెప్పడం సంచలనంగా మారింది. ఆది మాటల విన్నాక… ఈ రివర్స్ అటాక్ ఏంటని అందరూ వాపోతున్నారు.
సంక్రాంతి పండుగ నాడు ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. పండగ స్పెషల్ ఎపిసోడ్లో హైపర్ ఆది పెదరాయుడు మూవీ స్పూఫ్ స్కిట్ చేశాడు. అనంతరం నువ్వు జబర్దస్త్ మానేయడానికి కారణం ఎవరో చెప్పాలని యాంకర్ రష్మీ ఆదిని అడిగారు. దానికి సమాధానంగా ఆది స్క్రీన్ పై ఉన్న సౌమ్యరావు ఫోటో చూపిస్తూ… నేను జబర్దస్త్ మానేయడానికి ఆమెనే కారణం అంటూ సమాధానం చెప్పాడు. ఆయన ఆన్సర్ కి రష్మీ, ఇంద్రజతో పాటు షోలో ఉన్నవారందరూ షాక్ అయ్యారు. సదరు ఆరోపణకు హైపర్ ఆది ఎలాంటి వివరణ ఇచ్చాడనేది ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు.