Pathaan: బాలీవుడ్ అంటే మనకి ముందుగా గుర్తు వచ్చే పేరు షారుఖ్ ఖాన్..అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ ని దశాబ్దాల నుండి శాసిస్తున్న సూపర్ స్టార్ ఆయన..ఆయన సినిమా వస్తుందంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దద్దరిల్లాల్సిందే..అంతే కాకుండా ఓవర్సీస్ లో షారుఖ్ ఖాన్ కి ఉన్నటువంటి మార్కెట్ ఇండియా లో ఏ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ తెచ్చినా షారుఖ్ ఖాన్..కానీ అలాంటి సూపర్ స్టార్ కి గత కొంతకాలం నుండి సరైన సూపర్ హిట్స్ లేకపోవడం బాధాకరం..ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘జీరో’ 2018 వ సంవత్సరం లో విడుదలైంది..అప్పటి నుండి ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ నుండి హీరో గా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు..మధ్యలో కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ సోలో హీరో గా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
అన్నేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుండి వస్తున్న చిత్రం ‘పఠాన్’..సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి..అయితే హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు..ఇప్పటికే 200 కి పైగా షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ఈమధ్య కాలం లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకు దేనికి కూడా ఈ రేంజ్ బుకింగ్స్ చూడలేదు.

ఒక్క హైదరాబాద్ నుండే ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం బుకింగ్స్ ద్వారా వచ్చాయంటే షారుఖ్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..హైదరాబాద్ లో వారం రోజుల ముందు ఈ స్థాయి గ్రాస్ మన తెలుగు సినిమాలకు కూడా లేదు అనే చెప్పాలి.. అంతే కాకుండా ఈ సినిమా #RRR మరియు KGF చాప్టర్ 2 మొదటి రోజు వసూళ్లను కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.