Ram Gopal Varma Tweet: దర్శకుల్లో వివాదాస్పదమైన వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఏది మాట్లాడినా ఏం చేసినా వార్తల్లో ఉండటం ఆయనకు అలవాటే. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఆర్జీవీ ప్రస్తుతం మరో విధంగా వార్తల్లో నిలవడం గమనార్హం. జంతు ప్రేమపై ఆయన చేసిన ట్వీట్ పలువురు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి ఉన్న ప్రకృతిపై ప్రేమను వ్యక్తం చేయడంతో అందరు ప్రశంసిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో వివాదాల్లోనూ మరికొన్ని విషయాల్లో దయార్థ హృదయుడిగా తన ప్రభావం చూపిస్తుంటారు.అడవిలో ఓ చిరుత ఓ కోతిని నోటితో తీసుకెళ్తుండగా ఆ కోతిని కోతిపిల్ల హత్తుకున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఆకలి, చావు, ప్రేమ కనిపిస్తున్నాయి. ప్రకృతిలో వీటితో సంబంధాలు పెనవేసుకుపోతున్నాయి. ఆర్జీవీ చేసిన ట్వీట్ పై అందరిలో ఆశ్చర్యం కలిగింది. ప్రకృతిపై ఇంత దయ ఉందా అని నివ్వెరపోతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ బాగుందని చెబుతున్నారు.
ఆర్జీవీ చెప్పిన అర్థం బాగుందని కామెంట్లు పెరుగుతున్నాయి.ఫొటో పాతదే అయినా ఆర్జీవీ చేసిన దానిపై అందరిలో మంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల గురించి కాకుండా ప్రకృతిపై కరుణతో ఇలాంటి ఫొటో పోస్టు చేయడంతో ఆయనలో కూడా మానవతా దృక్పథం దాగి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మనుషులు ఒకలా ఉండరు సందర్భాన్ని బట్టి మారుతుంటారు. వివాదాల్లో ఉండే దర్శకుడిగా ఆర్జీవీ ప్రకృతిని ఆరాధించే వ్యక్తి గా మారడం విశేషం. లేకపోతే ఆడవారి అందాలను పొగడటమే పనిగా పెట్టుకుంటారు.

కానీ ప్రస్తుతం ఆయన పెట్టిన ఫొటోకు వేనోళ్ల పొగుడుతున్నారు.ఆర్జీవీలో మరో కోణం దాగి ఉందనే విషయం తెలుసుకుంటున్నారు. ఒకే ఫొటోలో చిరుతది ఆకలి, కోతిది ప్రాణం, పిల్ల కోతిది ప్రేమ ఇన్ని అంశాలు దాగి ఉన్న ఫొటో పోస్టు చేయడం బాగుందని చెబుతున్నారు. జంతువులను ఆరాధించే వ్యక్తిగా ఆర్జీవీకి మరో పేరు ఉందని అంటుంటారు. ఇలా ఆర్జీవీ జంతువుల తీరుపై కూడా స్పందించడం మామూలే. ఈ క్రమంలో ఆర్జీవీ పెట్టిన ఫొటోపై నెటిజన్లు మాత్రం సరైన విధంగా స్పందించి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఇంకా భవిష్యత్ లో ఏం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Hunger , Death and Love at the same time ..Nothing is more crueller than nature pic.twitter.com/1QkOSV1aA0
— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2023