Shahrukh 8 Pack At 58 : 58 ఏళ్ల వయసులో షారుఖ్ 8 ప్యాక్..: సుహానా ఫొటో వైరల్

Shahrukh 8 Pack At 58 :  బాలీవుడ్ బాద్ షా ను సిల్వర్ స్క్రీన్ మీద చూడక చాన్నాళ్లయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ తరుణంలో షారుక్ సినీ ప్రేక్షకులకు సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న సినిమాలోని లుక్ ను ఆయన సతీమణి, కూతురు విడుదల చేశారు. అయితే ఇదేదో మాములు స్టిల్ కాదు. ఏకంగా 8 ప్యాక్ అవతారమెత్తిన షారుక్ ఫొటో. 58 ఏళ్ల షారుక్ 8 ఫ్యాక్ లో అదిరిపోయాడు. దీంతో […]

Written By: NARESH, Updated On : March 27, 2022 12:54 pm
Follow us on

Shahrukh 8 Pack At 58 :  బాలీవుడ్ బాద్ షా ను సిల్వర్ స్క్రీన్ మీద చూడక చాన్నాళ్లయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ తరుణంలో షారుక్ సినీ ప్రేక్షకులకు సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న సినిమాలోని లుక్ ను ఆయన సతీమణి, కూతురు విడుదల చేశారు. అయితే ఇదేదో మాములు స్టిల్ కాదు. ఏకంగా 8 ప్యాక్ అవతారమెత్తిన షారుక్ ఫొటో. 58 ఏళ్ల షారుక్ 8 ఫ్యాక్ లో అదిరిపోయాడు. దీంతో ఆయన సతీమణి గౌరీఖాన్, కూతురు సుహానా ఖాన్ లు షారుఖ్ స్టిల్ ను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంత వయసు వచ్చినా బాద్ షాలో ఏమాత్రం సందడి తగ్గలేదని బీ టౌన్ చర్చలు పెడుతోంది. అసలు షారుక్ ఇలాంటి రోల్ ఏ సినిమాలోనిది..? అసలు వివరాలేంటో చూద్దాం..

షారుఖ్ ఖాన్ లెటెస్టుగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. ఈ సినిమాలోని షారుఖ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 8 ప్యాక్ తో ఉన్న షారుఖ్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 58 ఏళ్ల వయసులోనే షారుక్ లో క్రేజ్ తగ్గలేదని అంటున్నారు. మూడేళ్ల తరువాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో మళ్లీ తెరపైకి రాబోతున్నాడు. పఠాన్ కు సంబంధించిన రిలీజ్ డేట్ కు సంబంధించిన వీడియోలను మార్చి2న ఈ సీనియర్ హీరో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అవుతుండగానే లెటేస్టుగా షారుక్ లుక్ ను రిలీజ్ చేశారు.

మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ గా పేర్కొంటున్న ‘పఠాన్’ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇందులో షారుఖ్ తో పాటు జాన్ అబ్రహం, దీపికా పదుకునే కూడా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఇందులో కింగ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నాడు. అభిమానులకు దూరమై నాలుగేళ్లయింది… అయితే జనవరి 25 2023న థియేటర్లోకి రావడం కచ్చితమే.. అని షారుఖ్ ఇదివరకే టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పాడు.

2018లో జీరో మూవీతో చివరిసారిగా కనిపించిన షారుక్ ఇప్పుడు పఠాన్ తో అలరించనున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని ఆయన భార్య గౌరీఖాన్, కూతురు సుహాఖాన్ ట్విట్టర్లో తెలిపారు. షారుఖ్ క్రేజ్ ఇప్పటి వరకు కూడా తగ్గలేదని, అభిమానులు కోరుకునే విధంగా మరిన్ని సినిమాలు చేయబోతున్నాడని తెలిపారు.