https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ ఓటీటీ: 4వ వారం ఎలిమినేట్ ఎవరంటే..?

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ షోకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ప్రసారమవుతోంది. అది కూడా రోజుకు 24 గంటలూ స్ట్రీమింగ్ అవుతోంది. హీరో నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులను ఈ రియాలిటీ షో బాగానే ఆకట్టుకుంటోంది. డిస్పీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 27, 2022 / 01:11 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ షోకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ప్రసారమవుతోంది. అది కూడా రోజుకు 24 గంటలూ స్ట్రీమింగ్ అవుతోంది. హీరో నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులను ఈ రియాలిటీ షో బాగానే ఆకట్టుకుంటోంది.

    Bigg Boss Telugu OTT

    డిస్పీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఓటీటీ అప్పుడే నాలుగు వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్ నుంచి ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం ముమైత్ ఖాన్.. రెండో వారం శ్రీరాపాక.. మూడో వారం ఆర్జే చైతూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

    Also Read: Bigg Boss OTT Telugu Bindu Madhavi: ఆమె ‘టైటిల్ విన్నర్’.. బిగ్ బాస్ విశ్లేషకుల రివ్యూ ఇది

    తాజా సమాచారం ప్రకారం ఈ వారం సరయు హౌస్ నుంచి బయటకు వెళ్లనుందనే టాక్ నడుస్తోంది. సరయు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం.. ఇతర హౌస్‌మేట్స్‌తో ఆమె ప్రవర్తిస్తున్న విధానం, ఇస్తున్న స్టేట్‌మెంట్లు ప్రేక్షకులను చిరాకు పెడుతుండటంతో ఓట్లు తక్కువగా వచ్చాయని సమాచారం అందుతోంది. అంతేకాకుండా హౌస్‌లో ఆమెకు బూతుల సరయు అనే ముద్ర పడింది.

    బిగ్‌బాస్-5లో మొదటి వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన సరయు తన ఆటతీరు మార్చుకోకపోవడంతో ఓటీటీ వెర్షన్‌లోనూ నాలుగో వారంలోనే ఎలిమినేట్ కానుండటం గమనార్హం. ఇంకోవైపు ఈవారం డబుల్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. మరి హౌస్‌లో ఏం జరగబోతోందనేది ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

    Also Read: Bigg Boss OTT Telugu Bindu Madhavi: బిందుమాధ‌వితో అలాంటి స్కిట్ చేసిన‌ శివ‌.. ఇవేం మాట‌లు బాబోయ్‌..

    Tags