
Shah Rukh Khan Watch Price: ప్రపంచంలోని రిచ్చెస్ట్ యాక్టర్స్ లో షారుక్ ఖాన్ ఒకరు. 2022 గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ ఆరు వేల కోట్లు. దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఉన్నారు షారుక్. ఆయన చిత్రాలు అసామాన్యమైన రికార్డులు నెలకొల్పాయి. షారుక్ బ్రాండ్ వాల్యూ ఎవరూ అందుకోలేనిది. ఒక సామాన్యుడిగా పరిశ్రమకు వచ్చి అతిపెద్ద స్టార్ అయ్యారు. ఢిల్లీకి చెందిన షారుక్ ఖాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. వేల కోట్లకు అధిపతి అయ్యారు. మరి ఇంత పెద్ద స్టార్, రిచ్ పర్సనాలిటీ వాడే దుస్తులు, ఆభరణాలు, యాక్సెసరీస్ ఆయన రేంజ్ లోనే ఉంటాయి.
షారుక్ ఖాన్ ధరించిన రిస్ట్ వాచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దాని ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే సదరు వాచ్ ధర మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఆ వాచ్ ఖరీదుతో ఒక పది కుటుంబాలు జీవితాంతం హ్యాపీగా బ్రతికేయవచ్చు. లగ్జరీ వాచ్ బ్రాండ్స్ కి చెందిన ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ వాచ్ ధరించి షారుక్ అందరినీ ఆకర్షించారు. సదరు వాచ్ ప్రైస్ ఎంత అనే విషయం ఓ నెటిజన్ బయటపెట్టారు. షారుక్ చేతికి ఉన్న ఆ బ్రాండ్ మోడల్ వాచ్ ధర ఏకంగా రూ. 4.98 కోట్లు. దాదాపు ఐదు కోట్ల రూపాయలు అన్నమాట. ఈ బ్రాండ్ స్టేటస్ సింబల్ గా సెలెబ్రిటీలు వాడతారు. అత్యంత అరుదైన వాచ్ బ్రాండ్.
ఓ సామాన్యుడు జీవితం మొత్తం కష్టపడినా సంపాదించలేని అమౌంట్ ఆది. ఒక ఐదు లగ్జరీ కార్లు లేదా ముంబై వంటి మహానగరంలో ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. కోట్లు విలువ చేసే వస్తువు షారుక్ చేతికి తగిలించుకుని తిరుగుతున్నారన్నమాట. పఠాన్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న షారుక్ చేతికి ఉన్న వాచ్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. మరోవైపు పఠాన్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. షారుక్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా పఠాన్ నిలిచింది. రూ. 800 కోట్లకు మార్క్ దాటి రూ.1000 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతుంది.

వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ షారుక్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత కసితో పఠాన్ మూవీ చేశారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వసూళ్ల వరద పారిస్తుంది. అనేక అవాంతరాల మధ్య పఠాన్ విడుదలై విజయం అందుకుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించారు. హీరో జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. కెజిఎఫ్ 2 హిందీ వసూళ్లను పఠాన్ బ్రేక్ చేయడం విశేషం.