
Ram Charan- Ajith: #RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతూనే ఉంది.అయితే ఇప్పటి వరకు ఈ చిత్రణకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అధికారికంగా విడుదల చెయ్యకపోవడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ లో తీవ్రమైన అసహనం ఏర్పడింది.అయితే వాళ్ళ ఎదురు చూపులకు ఈ నెల 27 వ తారీఖున తెరపడనుంది.
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చెయ్యబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ CEO గా ఖరారు చేసినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందట.ఈ పాత్ర కోసం తొలుత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయిద్దామని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆయన ఊపిరి సలపనంతా బిజీ గా గడుపుతూ ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేస్తున్నాడు.అందుకే ఈ పాత్ర కోసం ఇప్పుడు తమిళం లో టాప్ 2 స్టార్ హీరోస్ లో ఒకరైన తల అజిత్ ని సంప్రదించారట.మంచి పాజిటివ్ రోల్ అవ్వడం తో అజిత్ కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

త్వరలోనే దీనికి సంబంధించిన వార్తని అధికారికంగా ప్రకటించబోతుందట మూవీ టీం.సెప్టెంబర్ నెల లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, sJ సూర్య, నవీన్ చంద్ర వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.