https://oktelugu.com/

Ileana: సంచలనం: పెళ్లి కాకుండానే తల్లైన ఇలియానా… సోషల్ మీడియా వేదికగా ప్రకటన!

Ileana: గోవా బ్యూటీ ఇలియానా అతిపెద్ద సంచలనానికి తెరలేపింది. తాను తల్లి అయినట్లు ప్రకటించి అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. ఇలియానా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారగా… నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా హిందీలో చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రోజుల్లో ఆమె బాలీవుడ్ మీద మోజు పడి కెరీర్ నాశనం చేసుకున్నారు. అక్కడ స్టార్ గా ఎదగాలన్న ఆమె కోరిక నెరవేరకపోగా… సౌత్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : April 18, 2023 / 09:40 AM IST
    Follow us on

    Ileana

    Ileana: గోవా బ్యూటీ ఇలియానా అతిపెద్ద సంచలనానికి తెరలేపింది. తాను తల్లి అయినట్లు ప్రకటించి అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. ఇలియానా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారగా… నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా హిందీలో చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రోజుల్లో ఆమె బాలీవుడ్ మీద మోజు పడి కెరీర్ నాశనం చేసుకున్నారు. అక్కడ స్టార్ గా ఎదగాలన్న ఆమె కోరిక నెరవేరకపోగా… సౌత్ లో ఫేమ్ కోల్పోయారు. రెంటికీ చెడ్డ రేవడి మాదిరి ఇలియానా పరిస్థితి అయ్యింది.

    దానికి తోడు లవ్ ఫెయిల్యూర్. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రీ నీబోన్ ఇలియానా ప్రేమించారు. ఆండ్రీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఇలియానా కెరీర్ ని కూడా నిర్లక్ష్యం చేసింది. అతడేమో ఇలియానాకు హ్యాండ్ ఇచ్చాడు. బ్రేకప్ డిప్రెషన్ నుండి బయట పడేందుకు ఇలియానాకు చాలా కాలమే పట్టింది. ఆ క్రమంలో ఆమె బరుపు పెరిగి షేప్ అవుట్ అయ్యారు.

    చికిత్స తీసుకున్న ఇలియానా మానసిక వేదన నుండి బయటపడ్డట్లు సమాచారం. మరలా కెరీర్ పై ఫోకస్ పెట్టి బరువు తగ్గారు. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఇలియానా మరల లావయ్యారు. ఆమె నటించిన లేటెస్ట్ ఆల్బమ్ ‘సబ్ గజబ్’ విడుదల కాగా ఇలియానా లుక్ చూసి షాక్ అయ్యారు. ఒకప్పటి ఆమె బొంగరం నడుము కాస్తా బొద్దుగా తయారైంది. మడతలు పడుతున్న ఆమె హిప్ చూసి ఫ్యాన్స్ విచారించారు.

    Ileana

    ఇదిలా ఉంటే సడన్ గా తల్లిని అయ్యానని ప్రకటించి మైండ్ బ్లాక్ చేసింది. ఇలియానా ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనం రేపుతోంది. మెడలో అమ్మ అని రాసి ఉన్న లాకెట్ తో కూడిన ఫోటోతో పాటు చిన్న పిల్లలు ధరించే బట్టల ఫోటో పోస్ట్ చేసింది. ‘త్వరలో వస్తున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆతృతగా ఉంది డార్లింగ్’ అని కామెంట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ చూసి కొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. అసలు పెళ్లి కాకుండా తల్లి కావడం ఏమిటీ? శుభాకాంక్షలు చెప్పడం ఏంటని? నెటిజెన్స్ వాపోతున్నారు. ఇలియానా పోస్ట్ ఆంతర్యం ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

     

    Tags