
Bhanupriya: ఇండస్ట్రీ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ భానుప్రియ..నటన మరియు డ్యాన్స్ లో ఆరోజుల్లో ఈమెకి పోటీ వచ్చేవాళ్లే లేరని అందరూ అంటూ ఉండేవారు.సితార అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైనా ఈమె సుమారు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. వయసు పెరిగే కొద్దీ కొత్త హీరోయిన్స్ రావడం వల్ల సహజంగానే సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతాయి, అలాగే భానుప్రియ కి కూడా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవకాశాలు మెల్లిగా తగ్గిపోయాయి.
అప్పటి నుండి ఈమె క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగింది, అయితే ప్రస్తుతానికి ఆమె సినిమాలకు దూరంగా కాలం గడుపుతుంది.చాలా కాలం తర్వాత ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.జీవితం లో ప్రస్తుతం ఆమె ఎదురుకుంటున్న సమస్యలను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది.అవి వింటే ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు.
ఆమె మాట్లాడుతూ ‘ నా భర్త చనిపోయినప్పటి నుండి నా పరిస్థితి ఏమి బాగాలేదు, మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయాను, ఫలితంగా నాకు మెమరీ లాస్ కూడా వచ్చింది..నా జీవితం లో ఎంతో ముఖ్య భాగమైన డ్యాన్స్ ని మర్చిపోయాను,ఇటీవలే ఒక షూటింగ్ లో పాల్గొన్న నేను నాకు ఇచ్చిన డైలాగ్స్ మొత్తం మర్చిపోయాను..నా మైండ్ మొత్తం బ్లాక్ అయ్యింది..నా ఆరోగ్యం అసలు బాగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది భానుప్రియ.ఒకప్పుడు కుర్రకారులకు కలల రాకుమారి, ఎన్నో హిట్ సూపర్ హిట్స్ లో నటించి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన అగ్రతార,ఇంత దీనంగా తన సమస్య గురించి చెప్పుకోవడం సంచలనం గా మారింది.

ఆమెని ఆ స్థితిలో చూసి అభిమానులు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్నారు.అయితే ఆర్టిస్టుగా ప్రస్తుతం ఆమె బిజీ గానే ఉంది, తమిళం లో గత ఏడాది ఈమె రెండు సినిమాల్లో నటించింది, కానీ తెలుగు సినిమాల్లో నటించి మాత్రం చాలా కాలమే అయ్యింది..ఈమె చివరిసారి గా తెలుగు తెర పై కనిపించిన చిత్రం మహానటి..ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, మానసికంగా అఆమే ఎంతో కృంగిపోయిందని ఆమె మాటలను చూస్తే అర్థం అయిపోతుంది.