Actress Kakinada Shyamala: సిల్క్ స్మిత మరణం గురించి ఆయనకే తెలుసు… నటి కాకినాడ శ్యామల సంచలన కామెంట్స్!

Actress Kakinada Shyamala: సినిమాకు మించిన డ్రామా సిల్క్ స్మిత జీవితంలో ఉంది. కేవలం 35 ఏళ్ల ప్రాయంలో ఆమె కన్నుమూశారు. సిల్క్ స్మిత మరణం ఇండియా వైడ్ న్యూస్ అయ్యింది. అభిమానులను విషాదంలో నింపేసింది. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించారు. ఆమెది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. సిల్క్ స్మిత వ్యక్తిత్వం గురించి నటి కాకినాడ శ్యామల తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. 200లకు పైగా […]

Written By: Shiva, Updated On : April 11, 2023 3:06 pm
Follow us on

Actress Kakinada Shyamala

Actress Kakinada Shyamala: సినిమాకు మించిన డ్రామా సిల్క్ స్మిత జీవితంలో ఉంది. కేవలం 35 ఏళ్ల ప్రాయంలో ఆమె కన్నుమూశారు. సిల్క్ స్మిత మరణం ఇండియా వైడ్ న్యూస్ అయ్యింది. అభిమానులను విషాదంలో నింపేసింది. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించారు. ఆమెది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. సిల్క్ స్మిత వ్యక్తిత్వం గురించి నటి కాకినాడ శ్యామల తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

200లకు పైగా చిత్రాల్లో నటించిన కాకినాడ శ్యామల మాట్లాడుతూ… సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా మంచిది. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే సిల్క్ స్మిత వేరు ఆమె రియల్ లైఫ్ వేరు. చాలా నిజాయితీగా ఉండేవారు. నేను అనేక సినిమాలకు ఫైనాన్స్ చేశాను. సిల్క్ స్మిత ఒక చిత్రం నిర్మించారు. దానికి కూడా నేను ఫైనాన్స్ ఇచ్చాను. అయితే ఆ సినిమా ఆడలేదు. దాంతో అప్పులపాలైంది.

కానీ అప్పులన్నీ తీర్చేసింది. నా డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది. మళ్ళీ నిలదొక్కుకుని మంచిగా జీవిస్తుంది. అప్పుడే ఆమె మరణించారు. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటారు. మరికొందరు ఆమెది హత్య అంటారు. నిజం ఏమిటనేది ఆ భగవంతుడుకి మాత్రమే తెలుసు… అన్నారు. కాకినాడ శ్యామల మాటలతో సిల్క్ స్మిత మీద గౌరవం ఇంకా పెరిగింది.

Actress Kakinada Shyamala

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. కడు పేద కుటుంబంలో పుట్టిన ఆమె ప్రాథమిక విద్య కూడా అభ్యసించలేదు. తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. చిన్న ప్రాయంలోనే భర్త వేధింపులు. తిరిగి ఇంటికి వెళదామంటే పేరెంట్స్ ఆదరిస్తారనే నమ్మకం లేదు. దాంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా మద్రాసు ట్రైన్ ఎక్కి ఇంటి నుండి పారిపోయింది. ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో టాప్ స్టార్ గా ఎదిగింది. సౌత్ ఇండియా శృంగార తారగా ఆమె అవతరించారు. విలక్షణ పాత్రలు చేశారు.

డర్టీ పిక్చర్ పేరుతో సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కింది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ లో సిల్క్ స్మిత రోల్ విద్యాబాలన్ చేశారు. అప్పట్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. విద్యాబాలన్ కి డర్టీ పిక్చర్ గుర్తింపు తెచ్చింది.