Kaikala Satyanarayana passes Away: తెలుగు సినీ నటుడు కైకాల సత్యనారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. నవరస నటనా సార్వభౌమగా కీర్తి గడించిన ఆయన మకుటం లేని మహానటుడిగా గుర్తింపు పొందారు. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసేవారు. యముడి పాత్రకైతే వేరే వారిని ఊహించుకోం. ఆ పాత్రకు ఆయన చేసినంత న్యాయం మరెవరు చేయలేరు. ఎముండ అని ఆయన చెప్పే డైలాగు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజులను కోల్పోయిన పరిశ్రమ ఇప్పుడు సత్యనారాయణను కోల్పోవడం బాధాకరం.

ఆయన మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన నటన ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసిన నటుడిగా అభివర్ణించారు. ఆరు దశాబ్ధాల పాటు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడని కొనియాడారు. ఇంకా ఎన్టీఆర్ తో కైకాలకు ఎంతో సన్నిహిత్యం ఉండేది. వారిద్దరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
కైకాల సత్యనారాయణ మరణంపై ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఎంతో వైవిధ్యమైన నటుడని కీర్తించారు. తన సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటిన నటుడని పేర్కొన్నారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు దేశంలోనే ఎవరు పోషించలేదని కొనియాడారు. ఎవరితో నటించినా వారితో స్నేహంగానే ఉండేవారు. అలా తన కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. సత్యనారాయణ మరణంపై సినీ ప్రముఖులు నీరాజనాలు అర్పించారు.

సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ట్విట్టర్ వేదికగా సంతాపాలు వెలిబుచ్చుతున్నారు. నటనతో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటుడిగా కైకాల సేవలు అమోఘం, అనిర్వచనీయం, అసాధ్యం అని చెబుతున్నారు. పాత చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కైకాల చూపిన అభినయం మరిచిపోలేనిదని అన్నారు. తన నటనతో ఎంతో మందిని మెప్పించిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం విచారకరమని పలువురు వ్యాఖ్యానించారు.