https://oktelugu.com/

Christmas : రానే వచ్చేసింది క్రిస్మస్.. ఇలా విషెష్ తెలియజేసేయండి

ఈ క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనలు, వేడుకలు, కమ్యూనిటీ సందర్శనల సమయం వంటివి ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మరి ఎలాగో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2024 / 01:01 PM IST

    Christmas Wishes

    Follow us on

    Christmas :  అందరూ ఎదురు చూసే క్రిస్మస్ రానే వచ్చింది. ఇతరులకి ఆనందం, ప్రేమ పంచడానికి ప్రతీ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్‌ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. జీసస్ మేరీ, జోసెఫ్‌లకు బెత్లెహెమ్‌లో ఏసుక్రీస్తు జన్మించాడని అందరూ నమ్ముతారు. మానవ రూపంలో జన్మించిన ఏసుక్రీస్తు తన బోధనలతో ప్రజలను మంచి బాటలోకి తీసుకెళ్లారు. ఈ క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనలు, వేడుకలు, కమ్యూనిటీ సందర్శనల సమయం వంటివి ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మరి ఎలాగో చూద్దాం.

    ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం, ఆనందం పంచాలని కోరుకుంటూ.. మెరీ క్రిస్మస్
    ఈ ప్రత్యేక సీజన్ మీ హృదయాన్ని, ఆనందంతో నింపేలా చేయాలని కోరుకుంటూ.. హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు
    ఇకపై అన్ని రోజులు ఉల్లాసంగా, ప్రకాశవంతంగా ఉండాలని ఆశిస్తూ మేరీ క్రిస్మస్
    సంతోషకరమైన క్రిస్మస్, కొత్త ఏడాది ఆశీర్వాదాలు, అదృష్టాలతో నిండి ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్
    మీ క్రిస్మస్ ప్రేమ, నవ్వు, సద్భావనతో నిండి ఉండాలని కోరుకుంటూ.. మీకు శుభాకాంక్షలు
    మీ ఇల్లు ఆనందాలతో నిండి ఉండాలని కోరుకుంటూ.. అద్భుతమైన క్రిస్మస్ శుభాకాంక్షలు
    మీకు ఉల్లాసంగా, ప్రకాశవంతంగా ఉండే క్రిస్మస్ శుభాకాంక్షలు
    మీ ప్రియమైన వారికి క్రిస్మస్ సందేశాలు పంపాలని కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్
    ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన క్రిస్మస్ కోసం మీకు నా శుభాకాంక్షలు
    క్రిస్మస్ రోజు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్
    మీకు ఆనందం, ప్రేమ, శాంతి ఈ క్రిస్మస్ ద్వారా అందాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!
    మీరు ఉల్లాసం, ఆనందంతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ.. మెర్రీ క్రిస్మస్
    క్రిస్మస్ నిజమైన ఆత్మ మీ హృదయంలో ప్రకాశిస్తుందని మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండని కోరుతూ.. హ్యాపీ క్రిస్మస్
    మెర్రీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ కోసం మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు
    రాబోయే సంవత్సరం అంతా మీకు శాంతి, ప్రేమ, ఆనందం దొరకాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్.
    మీ క్రిస్మస్ ప్రేమ, నవ్వు, సద్భావనల క్షణాలతో నిండి ఉండాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్.
    ప్రభువు ఈ క్రిస్మస్ రోజు నుంచి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు
    ఇతరులపై ఎల్లప్పుడూ ఓపిక, దయతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్
    క్రిస్మస్ అనేది హృదయంలో ఉండిపోయే ఒక ఘటన. మర్చిపోలేని అనుభూతి అని తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్
    ఏడాది మొత్తం క్రిస్మస్ పండుగలా జరుపుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్