Homeట్రెండింగ్ న్యూస్YouTube: యూట్యూబ్ లైక్ ల మోసం.. వెలుగులోకి భారీ సైబర్ క్రైం

YouTube: యూట్యూబ్ లైక్ ల మోసం.. వెలుగులోకి భారీ సైబర్ క్రైం

YouTube
YouTube

YouTube: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు.. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో అందరి దరిద్రాలకు ఒకటే ఆదాయ వనరు. అదే యూ ట్యూబ్. గూగుల్ ఏ ముహూర్తాన దీనిని కనిపెట్టిందో కానీ.. చాలా మందికి ప్రధాన ఆదాయవనరు అయిపోయింది. వీడియోలు, షార్ట్స్.. ఇలా చూస్తూనే ఉండిపోతాం.. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న కొంతమంది సైబర్ మోసగాళ్లు సరికొత్త దందాకు తెర లేపారు. యూట్యూబ్ లో వీడియోలను లైక్ చేస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన చూసి ఆకర్షితుడై గుర్ గ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి 8.5 లక్షల నగదు పోగొట్టుకున్నాడు.

గుర్ గ్రామ్ కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ లో తమ చెప్పిన వీడియోలను లైక్ చేస్తే.. ప్రతీ లైక్ కు ₹50 చెల్లిస్తాం అనేది ఆ మెసేజ్ సారాంశం. కాళ్లు కదపకుండా డబ్బులు వస్తున్నాయని సంబరపడిన ఆ వ్యక్తి… సదరు వ్యక్తులు చెప్పినట్టు అంగీకరించాడు. మరుసటి రోజు నందాకు ఒక మహిళ ఫోన్ చేసింది.. యూట్యూబ్ లైక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాపారపరమైన నిర్వహణ ఖర్చులకోసం కొంత నగదు జమ చేయాలని కోరింది. నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు నగదు రిక్వెస్ట్ పంపుతున్నామని చెప్పింది. అయితే ఆమె పంపిన రిక్వెస్ట్ పై క్లిక్ చేసిన తర్వాత విడతల వారీగా..₹8.5 లక్షల నగదు నందా ఖాతా నుంచి మాయమైంది.. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించిన అతడు.. మెసేజ్ పంపిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అవతలి వారి వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీనిపై బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

YouTube
YouTube

ఇలా చేస్తారు

యూట్యూబ్ ప్రస్తుతం బాగా విస్తృతమైన నేపథ్యంలో మోసగాళ్లు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్వేర్ వ్యాప్తి చేస్తున్నారు. ట్యుటోరియల్ వీడియోల పేరుతో యూజర్లను ఆకర్షిస్తున్నారు. ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆటో డెస్క్ 3 డీ ఎస్ మ్యాక్స్, ఆటో క్యాడ్ వంటి సాప్ట్ వేర్ లు ఎలా డౌన్ లోడ్ చేయాలో చెప్తాం అంటూ డిస్క్రిప్షన్ లో పేర్కొంటారు. అయితే ఇది నిజం అని నమ్మిన యూసర్లు వీడియోలపై క్లిక్ చేసిన తర్వాత.. కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. చేసిన తర్వాత వారి డివైజ్ లోకి మాల్ వేర్ డౌన్ లోడ్ అవుతుంది.. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్ళు వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన యాప్ ల వంటి వాటి వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటప్పుడే యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. ఫొంజీ వీడియోలు, లింక్ లను క్లిక్ చేయకపోవడమే మంచిది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular