
Koratala Siva: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కి రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వడం తో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు కానివీ కపూర్ నటించబోతున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన కూడా చేసింది.
షూటింగ్ ప్రారంభానికి ముందే జాన్వీ కపూర్ కి సంబంధించి ఒక చిన్న ఫోటో షూట్ ని కూడా నిర్వహించారు. అయితే గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో వినిపిస్తున్న మాట ఏమిటంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అంటూ ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది. అంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న జాన్వీ కపూర్ ని సెకండ్ హీరోయిన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?, రచ్చ చేసేయరూ అంటూ నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపించాయి.
అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యగా, అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ జాన్వీ కపూర్ అని, సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఒక ప్రముఖ తమిళ హీరోయిన్ ని సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆమెకి భారీ పారితోషికం కూడా అందిస్తున్నారట.పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం తో ఆమె కూడా సెకండ్ హీరోయిన్ గా చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది.

ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాని ఎట్టిపరిస్థితి లో ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పని చెయ్యబోతున్నారు. ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో రాసిన స్క్రిప్ట్ ఇది, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.