Homeట్రెండింగ్ న్యూస్Sara - Gil : గిల్ తో డేటింగ్ వార్తలపై సారా సంచలన ప్రకటన!

Sara – Gil : గిల్ తో డేటింగ్ వార్తలపై సారా సంచలన ప్రకటన!

Sara – Gil : బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది. సినిమాలు, క్రికెట్‌తో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ స్టార్‌ డాటర్‌ గత కొంత కాలంగా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రైజింగ్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌.. బ్యాట్‌తో మైదానంలో పరుగుల వరద పారిస్తున్న గిల్‌ సచిన్‌ కూతురుతో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సారా అలీఖాన్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. మొదటిసారి సారా క్రికెటర్‌పై నోరు విప్పారు. తాజాగా దీనిపై అమ్మడు స్పందించారు. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, కండీషన్స్‌ అప్లయ్‌ అని పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో కండీషన్‌ వెల్లడి.. 
విక్కీ కౌశల్‌తో సారా అలీఖాన్‌ ‘జర హట్‌ కే జర బచ్‌ కే’ సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారంటూ విలేకరి ఆమెను అడిగారు. ‘(వివాహాన్ని ఉద్దేశిస్తూ) వ్యక్తిగత జీవితంలో మీ నాన్నమ్మ షర్మిలా ఠాకూర్‌(ఆమె క్రికెటర్‌ మన్సూర్‌ను వివాహం చేసుకున్నారు)ను అనుసరిస్తారా?’ అంటూ సారాని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నటి ‘నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని మొదలుపెడతాను. అతడు ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఇలా రంగం ఏదైనా పర్వాలేదు’ అని తెలిపారు. అయితే ‘నా విలువలను గౌరవిస్తే చాలు’ అని బదులిచ్చారు.
డేటింగ్‌ ప్రచారంపై.. 
అనంతరం ఆమె.. తాను ఓ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా’ అని తెలిపారు. తనకు సంబంధం లేకుండా జరిగే ప్రచారాన్ని కూడా పట్టించుకోను అని స్పష్టం చేశారు. క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎఫైర్‌ ఉందనే వార్తలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.
ఇద్దరూ కలిసి కనిపించడంతో..  
గతంలో సారా, గిల్‌ ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో కంటబడడంతో.. ఇద్దరి మధ్య ఎఫైర్‌ ఉందనే టాక్‌ నడిచింది. అయితే ఆ తర్వాత ఇద్దరు సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో అవడంతో.. బ్రేకప్‌ చెప్పుకున్నారని అనుకున్నారు. తాజాగా సారా అలీఖాన్‌ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇకపోతే.. కేథర్నాథ్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైన సారా అలీఖాన్‌.. తనకంటూ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింబా, లవ్‌ ఆజ్‌ కల్, కూలీ నెం.1, అట్రాంగి రే, గ్యాస్‌లైట్‌ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘జరా హట్కే జరా బచ్కే’ చిత్రంతో థియేటర్లో సందడి చేస్తోంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular