Varun Tej Lavanya Tripathi Marriage: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి అతి త్వరలోనే జరగనుంది. రేపే వీళ్లిద్దరికీ నిశ్చార్థ వేడుక బంధుమిత్రులు మరియు కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖుల మధ్య జరగనుంది. ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ఒక రూమర్ లాగ ప్రచారమైన వార్త, అది రూమర్ కాదు , నిజమే అనే విషయం ఈమధ్యనే బయటపడింది.
‘మిస్టర్’ అనే సినిమా తో వీళ్లిద్దరు మొట్టమొదటిసారి కలుసుకున్నారు, ఆ సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ,వీళ్ళ మధ్య మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది. రేపు నిశ్చితార్థం జరిపి, ఈ నెలాఖరున పెళ్లి చేసుకునే ఆలోచనలో ఈ జంట ఉన్నట్టు సమాచారం.అయితే ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 14 వ తారీఖు నుండి వారాహి యాత్ర తో బిజీ కానున్నాడు. ఉభయగోదావరి జిల్లాలలో ఈ యాత్ర మొదలు కానుంది. కానీ వరుణ్ తేజ్ మరియు లావణ్యల పెళ్లి ఈ నెల 23 వ తారీఖున జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అప్పటికే టూర్ లో బిజీ గా ఉంటాడు, కాబట్టి ఆయన ఈ పెళ్ళికి హారయ్యే అవకాశమే లేదని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.
25 వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగనుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ 13 వ తారీఖున అన్నీ షెడ్యూల్స్ ని పూర్తి చేసి ‘వారాహి’ యాత్ర మొదలు పెట్టనున్నాడు. మరి కొడుకు లాంటి వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ రాకపోతే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.