Kurnool: మగవారు మగువలగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు.. అసలేంటి ఆచారం.. ఎందుకు?

హోలీ నాడు ఊరిలో మగవారంతా మగువులగా మారిపోతారు. చీర కట్టుకొని.. నగలు, పూలు అలంకరించుకొని అచ్చం ఆడవారి మాదిరిగా రెడీ అవుతారు. అనంతరం రతి మన్మధుల కు పూజలు చేస్తారు.

Written By: Dharma, Updated On : March 26, 2024 2:59 pm

Kurnool

Follow us on

Kurnool: జంబలకిడిపంబ సినిమా గుర్తు ఉంది కదూ. ఆ సినిమాలో మగాళ్లు ఆడాళ్లుగా.. ఆడవారు మగాళ్లుగా మారిపోతారు. కడుపుబ్బ నవ్విస్తుంది ఈ సినిమా. ఈవివి సత్యనారాయణ మార్కు కామెడీతో ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. అయితే నిజజీవితంలో కూడా ఓ గ్రామంలో ఆడవారు మగవారిగామారిపోతారు.అయితే అది ఒక్క హోలీ నాడే.జంబలకిడిపంబ సినిమాను రిపీట్ చేసే ఈ గ్రామం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూర్.దశాబ్దాలుగా అక్కడ ఈ ఆనవాయితీ కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

హోలీ నాడు ఊరిలో మగవారంతా మగువులగా మారిపోతారు. చీర కట్టుకొని.. నగలు, పూలు అలంకరించుకొని అచ్చం ఆడవారి మాదిరిగా రెడీ అవుతారు. అనంతరం రతి మన్మధుల కు పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని.. గ్రామానికి ఎటువంటి కష్టాలు రావని.. ఇంట్లో ఏ సమస్యలు రావని ఆ గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే హోలీ నాడు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. అయితే ఈ ఆచారాన్ని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు.

అయితే చూసేవారికి, వినేవారికి ఇదో వింత సంప్రదాయంగా కనిపించినా.. గ్రామస్తులు మాత్రం భక్తి ప్రపత్తులతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మగవారు సైతం ఎటువంటి బిడియం పడకుండా ఇది ఓ దైవ కార్యక్రమంగా భావిస్తారు. దీనివల్ల గ్రామానికి సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసంగా చెప్పుకుంటారు. ఆడవారి వేషం వేయడాన్ని ఒక నామోషీగా మాత్రం భావించరు.దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. యువకులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆడవారి వేషధారణతో అలరిస్తారు. మహిళలు ప్రత్యేకంగా వారిని అలంకరిస్తారు. అయితే ఈ ఆనవాయితీని, సంప్రదాయాన్ని చూసేందుకువివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారంటే.. ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు.