Sanju Samson: కేరళ స్టార్ బ్యాట్ మెన్ సంజూ శాంసన్ కు టీ20లో ఆడేందుకు అవకాశం వచ్చింది. శ్రీలకంతో జరిగే సిరీసులో సంజూ ఆడనున్నాడు. అయితే టీ20కి పరిమితం అయిన ఆయన వన్డేలకు దూరం కానున్నాడు. కానీ సంజూ టైమ్ స్ట్రాట్ అయిందని, ఇక నుంచి కచ్చితంగా ఛాన్స్ లు వస్తాయని అంటున్నారు. త్వరలో జరిగే న్యూజిలాండ్ సిరీసులోనూ సంజూకు చాన్స్ వస్తుందని అంటున్నారు. అయితే తన కెరీర్ ను కాపాడుకునే బాధ్యత ఆయనపైనే ఉందని కొందరు సీనియర్ క్రీడాకారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రదర్శన కాకుండా ఇక నుంచి జాగ్రత్తగా ఆడుతూ తన కెరీర్ ను బాగు చేసుకోవాలని సంగక్కర లాంటి వాళ్లూ చెబుతున్నారు.

రిషబ్ పంత్ విఫలమైన ప్రతీసారి సంజూకు అవకాశం ఇవ్వాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే బీసీసీఐ సెలక్టర్లు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మొత్తం సంజూ సూఫర్ ఫాంలో ఉన్నాడు. చివరిగా వెస్టీండీస్ తో పోరాడాడు. వన్డే మ్యాచ్ లో ఒకే ఒక్క అవకాశం ఇచ్చిన టీమిండియా మిగతా మ్యాచులకు మాత్రం ఆయనను సెలెక్ట్ చేయడం లేదు. అయితే ఆ ఒక్క మ్యాచ్ లో కూడా కీలకంగా మారాడు. అయితే బంగ్లాదేశ్ తో సీరిసులో భాగంగా పంత్ కు గాయం కావడంతో సంజూకు అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ కు బాధ్యతలను అప్పజెప్పింది.
అయితే ఇప్పుడు టీ 20 లో అవకాశం ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంజూ ప్రతిభను గుర్తించిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే సంజూ మునపటి విధంగా కాకుండా తన ఆట తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సంజూ తరువాత వచ్చిన రిషబ్ పంత్, కిషన్, గౌక్వాడ్ వంటి వాళ్లు ఎక్కువ మ్యాచుల్ ఆడారు. కానీ వాళ్ల ఆటతీరు కంటే సంజూ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడని సంజూ ఫ్యాన్స్ వాపోతున్నారు. అంతేకాకుండా కొందరు సీనియర్ క్రికెటర్లు కూడా సంజూకు ఫుల్ సపోర్టుగా ఉంటున్నారు.

ఇప్పుడు జరిగే శ్రీలంక మ్యాచ్ లో కనుక సంజూ మంచి ఆటతీరు కనబరిస్తే ముందు ముందు మరిన్ని అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పుడున్న టీమిండియాలో అత్యంత మెరుగైన ప్రదర్శన ఇచ్చే వాళ్లు లేరు. ఈ అవకాశాలన్ని సంజరూ వినియోగించుకోవాలని అంటున్నారు. కుర్ర క్రీడాకారుడి మనస్తత్వం నుంచి బాధ్యతగా జట్టు కోసం ఆడుతూ మంచి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అంటున్నారు. మిగతా వారి కంటే సంజూకు ఫ్యాన్స్ ఎక్కువే. ఇదే సమయంలో తన ప్రతిభ నిరూపిస్తే మరింత ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టమే జరగుతుందని అంటున్నారు.