
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మన దేశంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పిల్లలు, పెద్దలు చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్ ను వినియోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణకు ముందు శానిటైజర్ల వినియోగం ఉన్నా చాలా తక్కువమంది మాత్రమే శానిటైజర్లను వినియోగించేవారు. వైద్య రంగంలో పని చేసేవాళ్లు మాత్రమే శానిటైజర్లను ఎక్కువగా వినియోగించే వాళ్లు.
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి చిన్నారులు కూడా శానిటైజర్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే శానిటైజర్లను ఎక్కువగా వినియోగించడం వల్ల ఇబ్బందులు తప్పవని.. శానిటైజర్లు చిన్నారులపై దుష్ప్రభావాలను చూపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శానిటైజర్లు చిన్న పిల్లల్లో కంటి సమస్యలకు కారణమవుతున్నాయని.. చిన్నపిల్లల్లో కొంతమంది శానిటైజర్లను వినియోగించిన తరువాత కళ్లను ముట్టుకుంటున్నారని కళ్లను ముట్టుకోవడం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శానిటైజర్లలో ఆల్కహాల్ తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆ రసాయనాలు చిన్నారుల కళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిల్లలు చేతులను శుభ్రం చేసుకోవడం కొరకు శానిటైజర్ల కంటే సబ్బును వినియోగిస్తే మంచిది. శానిటైజర్ల వల్ల పిల్లల కళ్లు దెబ్బ తిన్న కేసులు గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 24 మధ్య కాలంలో ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ఒక అధ్యయనంలో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. పిల్లలకు తల్లిదండ్రులు శానిటైజర్ల గురించి అవగాహన కల్పించి వీలైనంత వరకు వారిని శానిటైజర్లకు దూరంగా ఉంచితే మంచిది.