
Sania Mirza- Ram Charan: రెండు దశాబ్దాలు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా సేవలందించారు. ఇండియా తరఫున 2003లో మొదలైన సానియా మీర్జా టెన్నిస్ ప్రస్థానం 2023 వరకు సాగింది. సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియం లో ఫెయిర్ వెల్ మ్యాచ్ ఆడారు. తన మొదటి మ్యాచ్ సానియా మీర్జా లాల్ బహదూర్ స్టేడియంలోనే ఆడారట. అందుకే తన చివరి మ్యాచ్ కి వేదికగా ఈ స్టేడియాన్ని ఎంచుకున్నారు. అలాగే గ్రాండ్ ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మహేష్ బాబు, నమ్రత, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
హైదరాబాద్ కి చెందిన క్రీడాకారిణి కావడంతో టాలీవుడ్ ప్రముఖులతో ఆమె సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్, ఉపాసన సైతం ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్. రామ్ చరణ్ సానియా మీర్జా ఫెయిర్ వెల్ పార్టీకి హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ లో మకాం వేశారు.
సానియా మీర్జా ఫెయిర్ వెల్ పార్టీకి హాజరు కాకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘డియర్ ఫ్రెండ్… ప్రపంచ టెన్నిస్ కోర్ట్స్ నీ ఆటను చూసే అదృష్టం కోల్పోతున్నాయి. ఇండియన్ టెన్నిస్ కి మీరు చేసిన సేవలు అసమానం. నీ కీర్తి పతాకం ఎగురుతూ ఉండాలి…’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే సానియా మీర్జాతో దిగిన ఫోటో షేర్ చేశారు. సదరు ఫొటోలో సానియా మీర్జాతో పాటు చరణ్ దంపతులు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

సానియా మీర్జా అనేక అంతర్జాతీయ టైటిల్స్ గెలిచారు. వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్… డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ వంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అందుకున్నారు. 2010లో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయక్ మాలిక్ ని వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఒక అబ్బాయి. పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకున్న కారణంగా సానియా మీర్జా విమర్శల పాలయ్యారు.
My dearest buddy @MirzaSania … Tennis courts across the world will miss seeing you in action.
Your contribution to sports in India is unmatched.
You continue to make us proud. pic.twitter.com/PL7fYORECZ— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2023