Samuthirakani Son : తమిళ నటుడు సముద్రఖని తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సముద్రఖని అటు దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. తెలుగులో శంభో శివ శంభో చిత్రానికి దర్శకత్వం వహించాడు. రవితేజ, అల్లరి నరేష్, సునీల్, శివబాలాజీ కీలక రోల్స్ చేసిన ఈ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. ఆయనే తెరకెక్కించిన దీని ఒరిజినల్ నాడోడిగల్ సూపర్ హిట్. తెలుగులో మాత్రం వర్క్ అవుట్ కాలేదు. తర్వాత నాని హీరోగా జెండాపై కపిరాజు చేశారు. ఇటీవల బ్రో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

తమిళంలో సూపర్ హిట్ కొట్టిన వినోదయసితం రీమేక్ గా బ్రో తెరకెక్కింది. తెలుగులో సైతం బ్రో హిట్ టాక్ సొంతం చేసుకుంది. బ్రో ప్రీ రిలీజ్ వేడుకలో సముద్రఖని మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నందుకు తెలుగు నేర్చుకున్నాడని, నాకు డైలాగ్స్ తెలుగులో రాసిచ్చేవారని చెప్పారు. దర్శకుడిగా గొప్ప సినిమాలు చేసిన సముద్రఖని నటనలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
తెలుగులో సముద్రఖని విలన్ రోల్స్ చేస్తున్నారు. అలవైకుంఠపురంలో, క్రాక్, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్ రోల్స్ చేశాడు. విశేషం ఏమిటంటే సముద్రఖని కొడుకు కూడా కోలీవుడ్ లో చాలా పాపులర్ . సముద్రఖని పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది తక్కువే. సముద్రఖనికి టీనేజ్ లో ఉన్న కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు హరి విగ్నేశ్వరన్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న హరి డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో యాక్టింగ్ చేస్తున్నాడు.
ఆల్రెడీ హరి డైరెక్టర్ గా ప్రస్థానం మొదలుపెట్టాడు. ‘అరియా తిసైగల్’ టైటిల్ తో ఒక షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు. 40 నిమిషాల ఈ క్రైమ్ థ్రిల్లర్ యూట్యూబ్ లో విడుదల చేశారు. కొడుకును ప్రోత్సహించేందుకు ఈ షార్ట్ ఫిల్మ్ ని సముద్రఖని స్వయంగా నిర్మించాడు. అరియా తిసైగల్ షార్ట్ ఫిల్మ్ కి చెప్పుకోదగ్గ ఆదరణ దక్కింది. గతంలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి అతడు దర్శకత్వం వహించినట్లు సమాచారం.
ఈ షార్ట్ ఫిల్మ్ లో హరి కూడా నటించాడు. యువకులు అనుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని వల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయో వాస్తవాలకు దగ్గరగా అరియా తిసైగల్ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. తండ్రి వలె దర్శకుడిగా నటుడిగా ఎదగాలన్నదే తన కోరిక అని హరి అంటున్నాడు. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసిన హరి విగ్నేశ్వరన్ భవిష్యత్ లో అద్భుతాలు చేస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు
.