Sobhita Dhulipala: గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శోభిత ధూళిపాళ . అయితే ఈమె సినిమాలకన్నా కూడా నాగచైతన్యతో ప్రేమాయణం నడుపుతోంది అనే రూమర్ తో ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక ఈమధ్య ఏకంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కనిపించింది శోభిత.
ఇక నాగచైతన్యతో ఏదో ఒక సంబంధం ఉండే ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ 2 ద్వారా బాగా పాపులర్ అయింది శోభిత.
ఇలా అన్ని భాషల్లో అవకాశం అందుకున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ” నేను ఎప్పుడూ తెరపై కనిపించాలి…నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రనీ నేను అస్సలు ఒప్పుకోను. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు అయితే ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన నచ్చిన పాత్రలను ఎంచుకుంటాను” అని అన్నారు శోభిత.
“పాత్రల ఎంపికే తప్ప సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అనేవి మన చేతిలో ఉండవు. నిజంగా అవకాశాలు అనేవి కానీ మన చేతిలో ఉంటే నేను కరణ్ జోహార్, ఫరాఖాన్ లాంటి గొప్ప దర్శకులతో కలిసి పని చేయాలి అని కోరుకుంటాను. కానీ అలాంటి అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాలనే మనసు పెట్టి చేస్తూ ఉన్నాను.కమర్షియల్‌గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నా” అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
“అలాగే స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వన్ లో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను..ఆ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉంటాయి” అని శోభిత తెలిపారు