Samantha Sensational Tweets: మొన్నటి వరకు నాగ చైతన్యపై పరోక్షంగా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చేసిన సమంత.. ఏకంగా ఎదురుదాడికి దిగింది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ వేశారు. 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణాలు ఇవేనంటూ అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. సమంత పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదని, అలాగే ఆమె తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్ల వెనుక నాగ చైతన్య పిఆర్ టీం హస్తం ఉందని అప్పట్లో సమంత పిఆర్ టీం ఆరోపించారు. నాగ చైతన్య కావాలనే సమంతపై వెనకుండి ఈ పుకార్లు వ్యాప్తి చేయిస్తున్నారని సమంత టీం ఆరోపించడం జరిగింది.
కాగా తాజాగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎఫైర్ రూమర్స్ వెనుక సమంత పిఆర్ టీం ఉందని నాగ చైతన్య పిఆర్ టీం ఆరోపిస్తున్నారు. నాగ చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి సమంత పిఆర్ టీం కావాలనే లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని నాగ చైతన్య టీం ఆరోపిస్తున్నారు. ఈ పరస్పర దాడుల గురించి వివరిస్తూ ఓ మీడియా సంస్థ కథనం రాసింది. సదరు కథనాన్ని కోట్ చేస్తూ సమంత… ట్వీట్ చేశారు.
Also Read: Pushpa 2: పుష్ప2 లో ఆ పాత్రను చంపేయబోతున్నారా? ఫ్యాన్స్ అంగీకరిస్తారా?
ఓ అమ్మాయి పై రూమర్స్ వస్తే అవి నిజాలు, అదే ఓ అబ్బాయిపై వస్తే మాత్రం కావాలని ఓ అమ్మాయి చేయిస్తున్న దుష్ప్రచారం. ఇకనైనా ఎదగండిరా బాబూ. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే … అంటూ సమంత తన ట్వీట్ లో కామెంట్ చేశారు. సమంత ఏకంగా నాగ చైతన్య, తన గురించి రాసిన ఆర్టికల్ ట్యాగ్ చేసి ఈ కామెంట్స్ చేయడంతో ప్రత్యక్ష దాడికి దిగినట్లు అయ్యింది.
నాపై వచ్చిన రూమర్స్ మాత్రం నిజం.. నాగ చైతన్యపై వచ్చిన రూమర్స్ మాత్రం నేను కావాలని చేయిస్తున్నానా..? అంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. సమంత ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళ మధ్య ప్రేమ మొదలైందని, ఆమె బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించారు అంటున్నారు. అలాగే నాగ చైతన్య నిర్మాణంలో ఉన్న తన డ్రీం హౌస్ కి పలుమార్లు శోభితను తీసుకెళ్లారట.
Also Read:Naga Chaitanya: తెలుగు హీరోయిన్ ప్రేమలో నాగ చైతన్య? … ఆమెతో చెట్టాపట్టాల్!
These Guys Just Got jealous Of Her Self Made Stardom !!
Just Shameless Guys !!And Importantly She Never Needs A PR Team To Defend You Guys !! We Are Always Here For Her !
She is Just A Self-Made Queen ~#SamanthaRuthPrabhu https://t.co/6i39XC7jes
— Krithick (@KrithickSammu) June 21, 2022