Samantha-Naga Chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత జంట గత కొంతకాలం క్రితం విడిపోవడం అందరిని ఎలాంటి షాక్ కి గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు కలిస్తే బాగుండును అని కోరుకునే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..కానీ సమంత పరోక్షంగా నాగ చైతన్య మీద చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే వీళ్ళు ఈ జన్మలో మళ్ళీ కలవరు.

కనీసం వృత్తిపరంగా సినిమాల్లో కూడా కలిసి నటించరు అనే విషయం అర్థం అవుతుంది..ఇక అసలు విషయానికి వస్తే సమంత లేటెస్ట్ చిత్రం యశోద బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూస్ లో అప్పట్లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్.
ఈ ప్రొమోషన్స్ లో ఆమె భాగంగా విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ ‘జీవితం లో మనకంటూ కొన్ని గోల్స్ ఉండాలి..అది నెరవేర్చుకునే క్రమం లో చాలా ఇబ్బందులను ఫేస్ చెయ్యాల్సి వస్తుంది..కొన్నిటిని మనం కోల్పోవాల్సి వస్తుంది కూడా..మనం మనకోసం ముందు బ్రతకాలి..ఒకరికి సుఖం పంచడం కోసం అయితే నేను పుట్టలేదు’ అంటూ సమంత పరోక్షంగా తన విడాకులు ఉద్దేశించి కామెంట్ చేస్తుంది..ఇక సమంత గత కొంత కాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే..ఇందుకోసం ఆమె కొద్ది రోజుల నుండి శస్త్ర చికిత్స తీసుకుంటుంది.
ఆరోగ్య పరిస్థితి లో ఎలాంటి మార్పు లేకపోవడం తో కొద్ది రోజులు ఆమె సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఆమె చేతిలో విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఖుషి’ మరియు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ చిత్రాలు ఉన్నాయి..ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆమె సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.