Yashoda Movie Trailer: సరోగసీ క్రైమ్స్.. యశోదగా అదరగొట్టిన సమంత!

Yashoda Movie Trailer: సమంత లేటెస్ట్ మూవీ యశోద. నవంబర్ 11న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా యశోద ట్రైలర్ విడుదల చేశారు. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో యశోద ట్రైలర్ పర్ఫెక్ట్ బ్లెండ్ లా ఉంది. రోజురోజుకూ దేశంలో సరోగసీ పెరిగిపోతుంది. సహజంగా పిల్లల్ని కనడం అరుదైపోతుండగా పలువురు కోటీశ్వరులు సరోగసీ పద్దతిని ఆశ్రయిస్తున్నారు. లక్షలు కుమ్మరించి ఎలాంటి కష్టం లేకుండా తల్లిదండ్రులు అవుతున్నారు. […]

Written By: Shiva, Updated On : October 27, 2022 6:29 pm
Follow us on

Yashoda Movie Trailer: సమంత లేటెస్ట్ మూవీ యశోద. నవంబర్ 11న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా యశోద ట్రైలర్ విడుదల చేశారు. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో యశోద ట్రైలర్ పర్ఫెక్ట్ బ్లెండ్ లా ఉంది. రోజురోజుకూ దేశంలో సరోగసీ పెరిగిపోతుంది. సహజంగా పిల్లల్ని కనడం అరుదైపోతుండగా పలువురు కోటీశ్వరులు సరోగసీ పద్దతిని ఆశ్రయిస్తున్నారు. లక్షలు కుమ్మరించి ఎలాంటి కష్టం లేకుండా తల్లిదండ్రులు అవుతున్నారు. ఈ క్రమంలో సరోగసీ పెద్ద బిజినెస్ గా మారింది.

samantha

ఎక్కడ డబ్బుంటే అక్కడ క్రైమ్ ఉంటుంది కాబట్టి… సరోగసీ మాఫియా చెలరేగిపోతుంది. ఈ అంశాల ప్రధానంగా యశోద మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కోటీశ్వరులకు బిడ్డల్ని అందించే ఒక సంస్థ చేస్తున్న నేరాల చుట్టూ యశోద కథ నడిచే అవకాశం కలదు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత నటన అద్భుతమని చెప్పొచ్చు. ఆమె యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీశారు. దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

దర్శక ద్వయం హరి-హరీష్ ఒక సోషల్ బర్నింగ్ టాపిక్ ఆధారంగా యశోద తెరకెక్కించారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో మణిశర్మ బీజీఎమ్ ఆకట్టుకుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే మురళీ శర్మ, రావు రమేష్, సంపత్ రాజు, శత్రు నటిస్తున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతుండగా యశోద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

samantha

కాగా సమంత నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం విడుదల వాయిదా పడింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీటితో పాటు విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా శాకుంతలం తెరకెక్కుతుంది. బాలీవుడ్ లో కూడా సమంత నటిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని వెబ్ సిరీస్లు చేస్తున్నారు.

 

Tags