Samantha: తన అందం మరియు అభినయం తో దశాబ్ద కాలం నుండి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ హీరోయిన్ సమంత త్వరలోనే సినిమాలకు ‘గుడ్ బై’ చెప్పబోతుందా?, ఇకమీదట ఆమెని మనం సినిమాల్లో చూడలేమా..? అని అభిమానుల సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..గత కొంత కాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమంత ప్రస్తుతం అందుకోసం చికిత్స చేయించుకుంటుంది.

చికిత్స తర్వాత ఆమె తొందరగా కోలుకుంటుందని అభిమానులందరూ భావించారు..కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందట..కోలుకోవడానికి మరింత సమయం పెట్టె అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు..అందుకోసం ఆమె సినిమాలకు చాలా లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అదే కనుక నిజమైతే సమంత ఫ్యాన్స్ చాలా తీవ్రమైన నిరాశకి గురి అవుతారు..లేటెస్ట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కిచుకున్న సంగతి తెలిసిందే.
డిప్రషన్ లో ఉన్న సమంత కి ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ని ఇచ్చింది..అదే ఉత్సాహం తో ఆమె తొందరగా కోలుకొని షూటింగ్స్ లో పాల్గొంటుంది అని అంతా భావించారు..కానీ ఇంకా ఆమె కోలుకోలేదు అనే వార్త ఫ్యాన్స్ లో భయాందోళన కలిగించేలా చేస్తుంది..ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం చేస్తుంది..ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయ్యింది..సమంత కి కోసమే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఆపేసారు.

ఈ సినిమా తో పాటుగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘శాకుంతలం’ లో కూడా సమంత నటిస్తుంది..ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరుకు 40 శాతం పూర్తి అయ్యింది..ఈ రెండు సినిమాలను త్వరలోనే ఆమె డాక్టర్లు ఇచ్చిన ప్రికాషన్స్ తో పూర్తి చెయ్యడానికి సిద్ధం అవుతుంది..ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆమె సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం..అది శాశ్వతంగా సినిమాలు మానేయొచ్చు అని కూడా చెప్తున్నారు.
