Shakuntalam Movie Postponed: ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’..ఈ చిత్రానికి కేవలం అతను డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా..ప్రముఖ టాలీవుడ్ టాప్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఇక ఎల్లప్పుడూ విభిన్నమైన పాత్రలు చేసేందుకు మొగ్గు చూపే సమంత , ఈ సినిమాలో టైటిల్ పాత్రని పోషించింది..అంతే కాదు ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న పాత్ర పోషించింది.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, గ్రాఫిక్స్ పరంగా అంచనాలను అందుకోలేదంటున్నారు అభిమానులు..మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించారు..అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 17 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది మూవీ టీం.
ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్నీ డైరెక్టర్ గుణ శేఖర్ తెలియచేసారు..ఈ ప్రెస్ మీట్ లో సమంత కూడా పాల్గొన్నది..అయితే కేవలం ఈ ప్రెస్ మీట్ మినహా, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభం అవ్వలేదు..సమంత అభిమానులు దీనిపై మూవీ టీం తీవ్రమైన కోపం తో ఉన్నారు..విడుదలకు పట్టుమని 16 రోజులు కూడా లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రొమోషన్స్ ప్రారంభించకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటి..సినిమా 17 వ తారీఖున విడుదల కావడం లేదా..అనే సందేహాలు మొదలయ్యాయి..అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ గుణ శేఖర్.

ఎందుకంటే అదే రోజు పలు తెలుగు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయట..వాటితో పాటు విడుదల చేస్తే శాకుంతలం కి థియేటర్స్ కొరత ఉంటుందని..శాకుంతలం కి పెట్టిన డబ్బులు మొత్తం తిరిగి రావాలంటే కచ్చితం గా సోలో రిలీజ్ ఉండాలని భావిస్తున్నాడట..దీనిపై ఫుల్ క్లారిటీ మరో రెండు రోజుల్లో రాబోతుంది.