https://oktelugu.com/

‘Shakuntalam’ Movie Review : ‘శాకుంతలం’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. కంటతడి పెట్టించేసిన సమంత!

‘Shakuntalam’ Movie Review : క్రియేటివ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘శాకుంతలం’.మన పురాతన మహాభారతం ఇతిహాసంలోని భరతుడి అంకానికి ముందు జరిగిన సంఘటనలను, దుష్యంత మహారాజు – శకుంతల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ఇది వరకు పూర్తి స్థాయి సినిమాలు రాలేదు. ఆ కోణం ని గమనించిన డైరెక్టర్ గుణశేఖర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో […]

Written By: , Updated On : April 10, 2023 / 10:44 PM IST
Follow us on

‘Shakuntalam’ Movie Review : క్రియేటివ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘శాకుంతలం’.మన పురాతన మహాభారతం ఇతిహాసంలోని భరతుడి అంకానికి ముందు జరిగిన సంఘటనలను, దుష్యంత మహారాజు – శకుంతల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ఇది వరకు పూర్తి స్థాయి సినిమాలు రాలేదు.

ఆ కోణం ని గమనించిన డైరెక్టర్ గుణశేఖర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి భారీ బడ్జెట్ తో ఈ డ్రీం ప్రాజెక్ట్ ని నిర్మించాడు.మధ్యలో కరోనా లాక్ డౌన్ పడడం, సమంత ఆరోగ్యం క్షీణించడం తో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఎట్టకేలకు ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని ఈ సినిమా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కాబోతుంది.తెలుగు తో పాటుగా హిందీ , తమిళం , మలయాళం బాషలలో కూడా ఈ చిత్రాన్ని 2D మరియు 3D వెర్షన్స్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు UA సర్టిఫికెట్ ని జారీ చేసారు.ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి,కానీ టికెట్స్ అమ్ముడుపోవడం లేదు.హైదరాబాద్ నుండి అమెరికా వరకు సమంత గత చిత్రం ‘యశోద’ తో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా అద్భుతమైన టాక్ రావాల్సిందే.ప్రస్తుతం సెన్సార్ నుండి ఈ సినిమాకి వచ్చిన టాక్ పాజిటివ్ గానే ఉంది.

గ్రాఫిక్స్ మీద కొద్దిగా శ్రద్ద పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని, కానీ సినిమాని మంచి ఎమోషనల్ గా, చరిత్ర ని ఎక్కడా వక్రీకరించకుండా చాలా చక్కగా తీసారని సెన్సార్ సభ్యులు మూవీ టీం ని మెచ్చుకున్నారు.సమంత ఎప్పటిలాగానే తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే రేంజ్ లో చేసిందని, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారట.మరి సెన్సార్ నుండి వచ్చిన టాక్ నిజం అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.