Samantha, Vijay Devarakonda
Samantha Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ-సమంత ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. వారికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ కశ్మీర్ లో సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ సీన్ తీస్తుండగా వీరద్దరూ ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయినట్లు తెలిసింది. వీరికి తీవ్ర గాయాలయ్యాయని.. ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Samantha, Vijay Devarakonda
కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా విజయ్-సమంతల కారుకు ప్రమాదం జరిగింది. ఈ సన్నివేశం చాలా టఫ్ గా తీశారని.. నదికి రెండువైపులా కట్టిన తాడుపై సమంత-విజయ్ కారులో నడపుతూ వెళ్లాలని.. కానీ దురదృష్టవశాత్తూ వాహనం నదిలో లోతైన నీటిలో పడిపోయినట్లు తెలిసింది. ఇద్దరి వెన్నుముఖలకు తీవ్రగాయాలైనట్లు చెబుతున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశం కోసం షూటింగ్ చేస్తుండగా విజయ్-సమంత నదిలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. దీంతో షూటింగ్ నిలిపివేశారు.
Also Read: Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి
ప్రమాదం జరిగిన వెంటనే విజయ్, సమంతలను ముందుగా దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హోటల్ కు తరలించారు. వైద్యులతో చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్-సమంత జంటగా ఒక ప్రేమకథా చిత్రాన్ని తీస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు పెట్టారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ స్టైలిష్ లుక్ లో కనిపించగా.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదలకు ప్లాన్ చేశారు. విజయ్ కు ఇది 11వ సినిమా.. మహానటి తర్వాత సమంత-విజయ్ కలిసి నటిస్తున్న చిత్రమిదీ.. కానీ ఇప్పుడు విజయ్-సమంతలకు గాయాలు కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.
Also Read: Bald Groom: పెళ్లి జరుగుతుండగానే వీడిన విగ్గు.. వివాహం వద్దన్న వధువు
Recommended Videos:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Samantha ruth prabhu vijay deverakonda injured after vehicle falls into deep water during kushi shooting in kashmir
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com