Naga Chaitanya , Samantha
Samantha Ruth Prabhu : సౌత్ ఇండియాలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా మహిళగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిల్చిన వారిలో ఒకరు సమంత. కష్టసమయం లో ఎలాంటి మగవాడి తోడు లేకుండా జీవిత ప్రయాణం సాగించడం ఎలాగో సమంత ని చూసి నేర్చుకోవచ్చు. ఆమెతో నటించే నటీనటులు కూడా సమంత గురించి ఈ విషయం లో ఎంతో గొప్పగా మాట్లాడుతారు. ఆమె కెరీర్ ప్రారంభానికి ముందు ఎన్నో ఒడిదుగులను ఎదురుకొని ఇండస్ట్రీ లోకి వచ్చింది. మొదటి సినిమాతోనే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా మన తెలుగు స్టార్ హీరోలందరితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తమిళంలో కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
అయితే ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే. నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవడం వంటివి మనమంతా చూసాము. ఈ సంఘటన జరిగి రెండేళ్లు దాటింది, నాగ చైతన్య సమంత ని పూర్తి గా మర్చిపోయి శోభిత దూళిపాళ్ల ని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. కానీ సమంత కి మాత్రం చేదు జ్ఞాపకాలే మిగిలాయి. రీసెంట్ గా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుందో మీ అందరికీ తెలిసిందే. నేను కూడా అలాంటి అవమానాలకు గురయ్యాను. నా మీద ఎన్నో అబద్దాలను పుట్టించారు. అవన్నీ అబద్ధాలని, అసలు నిజాలు చెప్పాలని చాలాసార్లు అనిపించింది. ఆ క్షణం లో నాతో నేను చేసుకున్న సంభాషణ కారణంగానే ఆగాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘విడాకులు తీసుకున్న తర్వాత నేను ఏడవని రోజంటూ లేదు. కానీ జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదు, ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను. నా జీవితం లో నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా ఆమెకు కొత్తగా అధ్యాయం మొదలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆమె డేట్స్ ఇవ్వాలే కానీ, స్టార్ హీరోలందరూ ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూలు కడుతారు. మరి ఆమె ఎదురు చూస్తున్న అధ్యాయం ఏమిటి?, రెండవ పెళ్లి గురించేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆమె కూడా నాగ చైతన్య లాగా రెండా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.