Sreemukhi: శ్రీముఖి డ్రెస్సింగ్ ని ఉద్దేశిస్తూ హీరోయిన్ శ్రీలత ఆసక్తికర కామెంట్స్ చేశారు. డ్రెస్ నీకు నచ్చితే సరిపోతూ అది నప్పాలి కూడా అంటూ ఉచిత సలహా విసిరింది. హీరోయిన్ మాధవి లత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు అమ్మాయి అయిన మాధవి లత 2008లో విడుదలైన నచ్చావులే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డీసెంట్ హిట్ సొంతం చేసుకుంది. అలాగే ఆమె హీరో నానికి జంటగా నటించిన స్నేహితుడు సైతం మంచి విజయాన్ని సాధించింది. అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించిన మాధవి లత రెండు తమిళ చిత్రాలు కూడా చేశారు.

నటిగా కలిసి రాకపోవడంతో ఆమె రాజకీయాల బాట పట్టారు. బీజేపీ కండుగా కప్పుకున్నారు. మాధవి లత సోషల్ మీడియా పోస్ట్స్, ఇతరులను ఉద్దేశించి చేసే కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. నచ్చని విషయాలపై సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతూ ఉంటుంది. ఇక బీజేపీ నాయకురాలిగా అప్పుడప్పుడు మెరుపులే కానీ చెప్పుకోదగ్గ క్రియాశీలకంగా ఉండదు. తాజాగా మాధవి లత యాంకర్ శ్రీముఖిని టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీముఖి హాట్ ఫోటో షేర్ చేస్తూ… శ్రీముఖి నీవు మోడరన్, అల్ట్రా మోడరన్ ఎలాంటి బట్టలైనా వేసుకో. కానీ అవి నీకు నచ్చితే సరిపోదు. ఒంటికి నప్పాలి కూడా. అది కూడా పరిగణలోకి తీసుకొని బట్టలు ఎంచుకో, అని కామెంట్ పోస్ట్ చేసింది. శ్రీముఖి బుల్లితెర షోలలో ధరిస్తున్న కొన్ని రకాల బట్టలు ఆమెకు సెట్ కావడం లేదు. సదరు బట్టల్లో శ్రీముఖి అందవిహీనంగా కనిపిస్తుందన్న అర్థంలో మాధవి లత ఆమెకు ఈ సలహా ఇచ్చారు. ఒక హీరోయిన్ శ్రీముఖి డ్రెస్ సెన్స్ పై కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరి ఆమె సలహా ఏ మేరకు శ్రీముఖి పాటిస్తుందో చూడాలి. కొన్నాళ్లుగా శ్రీముఖి గ్లామర్ డోస్ మరింత పెంచారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అదే సమయంలో షోలలో శ్రీముఖి ధరించే బట్టలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బుల్లితెరపై అనసూయ, సుమ హవా తగ్గడంతో శ్రీముఖి దూసుకుపోతుంది. శ్రీముఖి ఇప్పటికే ఐదారు షోలకు యాంకర్ గా ఉన్నారు. కొత్తగా ప్రారంభం అవుతున్న బీబీ జోడి షోకి కూడా శ్రీముఖినే యాంకర్ గా ఉన్నారు.