
Samantha: సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా మూవీగా శాకుంతలం ఐదు భాషల్లో విడుదల కానుంది. శాకుంతలం చిత్రానికి ఏకైన సమంత స్టార్ అట్రాక్షన్. సమంత తన మేనియాతో థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించాల్సి ఉంది. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం టీమ్ ముంబై వెళ్లారు.ఏప్రిల్ 6 గురువారం ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సమంతతో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, హీరో దేవ్ మోహన్, నీలిమ గుణ ఈవెంట్లో పాల్గొన్నారు.

శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్లో సమంత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వైట్ అండ్ వైట్ కోట్ అండ్ ప్యాంట్స్ ధరించారు. సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ అదిరిపోయింది. సదరు ట్రెండీ వేర్లో గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. లోదుస్తులు లేకుండా క్లీవేజ్ అందాలతో సమంత మగాళ్ల మనసులు దోచేశారు. సమంత గ్లామర్ టెంప్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.
శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత కేవలం తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు. అదేదో డ్రెస్ కోడ్ మాదిరి ఫాలో అవుతున్నారు. శాకుంతలం పౌరాణిక చిత్రం కావడంతో సమంత ఇలా చేస్తున్నారనిపిస్తుంది. అలాగే మూవీలో తన క్యారెక్టర్ థీమ్ కి మ్యాచ్ అయ్యేలా సమంత తెల్లని బట్టలో దర్శనమిస్తున్నారు. ఒక్కోసారి చేతిలో జపమాలతో పూర్తి డివోషనల్ లుక్ కి మారిపోతున్నారు.

గతంలో సమంత సినిమా ఈవెంట్స్ కి హాట్ హాట్ గా హాజరయ్యేది. ఆఫ్ స్క్రీన్ లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ పలుమార్లు వివాదాస్పదమైంది. పెళ్ళైన అమ్మాయిగా ఈవెంట్స్ లో కొంచెం పద్దతిగా బట్టలు వేసుకోవచ్చుగా అంటూ ఆమెపై ఒకింత అసహనం వ్యక్తమైంది. కారణం తెలియదు కానీ ఈ మధ్య ఆఫ్ స్క్రీన్ లో గ్లామర్ డోస్ తగ్గించింది. లేటెస్ట్ ముంబై ఈవెంట్ కోసం మాత్రం కొంచెం సెక్సీ అప్పీల్ ట్రై చేశారు.
మరోవైపు సమంత రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శత్వంలో సిటాడెల్ సిరీస్లో నటిస్తున్నారు. సిటాడెల్ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది.