Samantha: గత కొంతకాలంగా మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడు ఆ రోగం నుండి పూర్తి కోలుకోవడం తో వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యింది..రీసెంట్ గానే ఆమె రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనింది..ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ని రూసో బ్రదర్స్ విడుదల చేస్తూ ‘వెల్కమ్’ అంటూ ఇంస్టాగ్రామ్ లో సమంత ని ట్యాగ్ చేసి పోస్ట్ చేసారు.

రూసో బ్రదర్స్ వంటి పాపులర్ ఫిలిం మేకర్స్ తో కలిసి పని చెయ్యడం అంటే సాధారమైన విషయం కాదు..’ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో విలన్ గా నటించిన సమంత కి ఇంటర్నేషనల్ లెవెల్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది..రూసో బ్రదర్స్ కి కూడా ఆమె నటన బాగా నచ్చడం తో వెంటనే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సమంత కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు..వారిలో రాహుల్ రవి చంద్రన్ కూడా ఒకడు..ఆయన సమంత గురించి మాట్లాడుతూ ‘చూసారా ఇది సమంత రేంజ్..ఏకంగా రూసో బ్రదర్స్ వంటి వారు సమంత తో కలిసి పని చెయ్యడానికి ఇంత ఆసక్తి చూపిస్తున్నారు..ఆమె మన టాలీవుడ్ మొత్తాన్ని గర్వపడేలా చేస్తుంది’ అంటూ ఒక ట్వీట్ వేసాడు..దీనికి సమంత క్వాట్ చేస్తూ ‘థాంక్యూ రాహుల్..నీలాంటి స్నేహితుడు నా జీవితం లో ఉండడం అదృష్టం గా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..మరోవైపు సమంత పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడం తో ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు..ఈ వెబ్ సిరీస్ తో పాటుగా ఆమె విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..ఈ మూవీ తదుపరి షెడ్యూల్ లో సమంత పాల్గొనబోతుంది.