Chiranjeevi- Cameraman Devraj: చిరంజీవి దానగుణాన్ని, మంచితనాన్ని గుర్తించక విమర్శించే వాళ్ళు ఎందరో ఉన్నారు. చిరంజీవి అవేమీ పట్టించుకోరు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసే అలవాటు మానుకోరు. పరిశ్రమైనా… పరిశ్రమకు చెందినవారైనా కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ముందుకు వస్తారు. సామాజిక సేవ బాధ్యతగా భావించే చిరంజీవి దానధర్మాల లెక్కల చిట్టా రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన చిరంజీవి కోట్లు సంపాదించే హీరో అయ్యారు. అప్పటి నుండే ఆయన సోషల్ సర్వీస్ మొదలుపెట్టారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు.

తాజాగా మరోసారి చిరంజీవి తన దాతృత్వం చాటుకున్నారు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేశారు. కొన్నాళ్లుగా దేవరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి వచ్చింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న దేవరాజ్, ఆయన కుమారుడిని ఇంటికి పిలిచి ఐదు లక్షల చెక్ అందించారు. దీంతో దేవరాజ్ కుటుంబం చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
ఈ విషయాన్ని చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో న్యూస్ వైరల్ గా మారింది. నెటిజెన్స్ చిరంజీవి చేసిన మంచి పనికి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదేమైనా చిరంజీవి గొప్పవారంటూ కొనియాడుతున్నారు. దేవరాజ్ దశాబ్దాల పాటు పరిశ్రమలో పనిచేశారు. చిరంజీవితో పాటు రజనీకాంత్, నాగార్జున, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ చిత్రాలకు కూడా కెమెరా మెన్ గా పని చేశారు.వివిధ భాషల్లో 300లకు పైగా సినిమాలకు పనిచేశారు. ఇక చిరంజీవి నటించిన నాగు, పులి బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ చిత్రాలకు ఆయన కెమెరామెన్ గా వ్యవహరించారు.

మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వందలకు పైగా వసూళ్లతో వాల్తేరు వీరయ్య సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు కే ఎస్ రవీంద్ర వాల్తేరు వీరయ్య తెరకెక్కించారు. రవితేజ కీలక రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు.