Samantha: నాలుగు నెలల క్రితమే తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే పేరును తొలగించింది సమంత.. కేవలం ‘ఎస్’ అనే అక్షరాన్ని మాత్రమే పెట్టి కలకలం రేపింది. దీంతో నాగచైతన్యతో విభేదాలు వచ్చాయని వారు విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఎన్ని మీడియాలు అడిగినా వారిద్దరూ బయటపడలేదు. తాజాగా విడిపోతున్నట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వీరిద్దరి విడాకులు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే సమంత మరోసారి ఆశ్చర్యపరిచింది. తన సోషల్ మీడియా ఖాతాలో మళ్లీ పేరు మార్చేసింది. సమంత తన అధికారిక ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలకు ‘Samantha’ అనే పేరు పెట్టుకుంది. అయితే ఫేస్ బుక్ ఖాతాలో మాత్రం ‘సమంత అక్కినేని’ అని మాత్రమే ఉంది. అందులోనూ మార్చనున్నట్టు తెలుస్తోంది.
2017లో నాగచైతన్యతో సమంత పెళ్లి తర్వాత ‘సమంత రుతుప్రభు’ అనే పేరున్న సమంత తన పేరును సోషల్ మీడియాలో ‘సమంత అక్కినేని’గా మార్చుకుంది. నాడు అందరిచేత ఇలా మార్చుకొని ప్రశంసలు అందుకుంది.
అయితే గత జులై నెలాఖరులో తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ‘ఎస్’ అనే పేరును మాత్రమే పెట్టి అందరికీ షాకిచ్చింది. అప్పుడే నాగచైతన్యతో విభేదాలు అన్న విషయం బయటపడింది. తాజాగా విడాకులతో వీరి వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడింది.
ఇక సమంత ప్రాణ స్నేహితురాలు ‘చిన్మయి’ తాజాగా ఈ విడాకులపై హాట్ కామెంట్స్ చేసింది. ‘పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు’ అటూ కామెంట్ చేసింది. చిన్మయి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/samanthaprabhu2?lang=en
https://twitter.com/Samanthaprabhu2/status/1442026178538209281?s=20