Samantha- Vijay Deverakonda: లైగర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..ఆ సినిమా తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తో ఖుషి అనే చిత్రం చేస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుంది..కాశ్మీర్ నేపథ్యం లో సాగే ఒక అందమైన లవ్ స్టోరీ ఇది..శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ వెళ్లిన ఈ సినిమా సమంత కి ‘మయోసిటిస్’ అనే వ్యాధి రావడం వల్ల కొంత కాలం బ్రేక్ పడింది.

అయితే ఇప్పుడు ఆమె కోలుకోవడం తో మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అవ్వడానికి సిద్ధం అయ్యింది..ఈ క్రమం లోనే ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటించడానికి సిద్ధం అయ్యింది..ఇందులో హీరో గా బాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు జరిగింది.
ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో అప్పటి నుండి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సమంత ని ట్యాగ్ చేసి, ‘అసలు మా సినిమా చేసే ఉద్దేశ్యం ఉందా నీకు..ఇన్ని రోజులు సమయం వృధా అయ్యిందని మేము బాధపడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు మా సినిమాని పక్కన పెట్టి బాలీవుడ్ సినిమా చేస్తున్నావు..ఇదెక్కడి న్యాయం’ అని ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్ అడిగిన ప్రశ్న కి సమంత రిప్లై ఇస్తూ ‘రౌడీ ఫ్యాన్స్ అందరికీ నా క్షమాపణలు..ఖుషి తదుపరి షెడ్యూల్ లో నేను పాల్గొనబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది..దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాస్త శాంతించారు.

ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు..గతం లో ఇదే ‘ఖుషి’ టైటిల్ తో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే..విజయ్ దేవరకొండ ఖుషి కూడా అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని శివ నిర్వాణ ఈ సందర్భంగా తెలిపాడు.