Mega Family- YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే వైఎస్.రాజారెడ్డి కుటుంబం అంటేనే ఫ్యాక్సనిజానికి పెట్టింది పేరు అన్న అభిప్రాయం ఏపీ జనాల్లో ఉంది. ఈ సమయంలో ఆయన వరసత్వాన్ని పునికిపుచ్చుకున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని 2019లో అధికారంలోకి వచ్చారు. వైఎస్సార్‌ను మరపించే పాలన చేస్తానని హామీ ఇచ్చారు. కానీ మూడున్నరేళ్లకే జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరోమారు అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదుగుతోంది. దీనిని జీర్ణించుకోలేని జగన్ పవన్ టార్గెట్‌గా మేగా కుటుంబంపైనే విద్యేవష రాజకీయాలను ప్రోత్సహిస్తోంది.

ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి..
తెలుగు సినిమారంగంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. చిరంజీవికి సౌమ్యుడిగా వివాద రహితుడిగా, సున్నిత మనస్కుడిగా అందరూ భావిస్తారు. అయితే జనసేనాని పవన్ తన అన్న చిరంజీవిలా సౌమ్యుడు కాడు. ప్రజల కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. మాటకు మాట సమాధానం చెప్పడం, ప్రజాసమస్యలపై ఉద్యమించడం పవన్ నైజం. రాజకీయ నేతలు పవన్‌లా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కూడా అభిప్రాయపడ్డారు. తనలాంటి వారికి రాజకీయాలు నప్పవని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ పవన్‌కు రాజకీయంగా పెద్దగా సపోర్టు ఇవ్వని చిరంజీవి, ఇటీవల తన సోదరుడికి అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ వీరిని విడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ అవి పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో మెగా ఫ్యామిలీ ఇమేజ్‌నే డ్యామేజ్ చేయాలని చూస్తోంది.
మూకుమ్మడి విమర్శలు..
ఏపీలో వైసీపీ సర్కార్‌ను జనసేన సమస్యలపై నిలదీస్తుంటే.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పవన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ వస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిటీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మంత్రి రోజా మెగా ఫ్యామిటీ మొత్తంపై విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, వైసీపీ పవన్ స్నేహితుడైన నటుడు అలీకి చిన్న పదవి ఇచ్చింది. దీంతో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ ఆదేశిస్తే తాను పవన్‌పై పోటీచేస్తానని ప్రకటించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో కమెడియన్ ఆది జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కు అవడగా నిలిచారు. దీంతో మంత్రి రోజా మరింత రెచ్చిపోయి మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా విమర్శలు చేశారు.

సినిమా ఆర్టిస్టుల మధ్య విభేదాలు తెచ్చేలా..
మరోవైపు జగన్ సర్కార్ పవన్‌కు సినిమా నటులతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పవన్‌కు వారిని దూరం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అలీ, రోజాతో విమర్శలు చేయించినట్లు తెలుస్తోంది. కానీ వాస్తవంగా సినిమా నటులు ఒక కుటుంబంగా ఉంటారు. రాజకీయంగా విమర్శలు చేసుకున్నా, ఇండస్ట్రీ విషయానికి వచ్చే సరికి అందరూ ఒక్కటవుతారన్న విషయం వైసీపీ గమనించకపోవడం గమనార్హం.