Rajasthan Minister Ashok Chandna: విషయపరిజ్ఞానం లేనప్పుడు “వివర”పరిజ్ఞానమైనా ఉండాలి అంటారు. కానీ ఇవి రెండూ లేకుంటే అభాసుపాలు కావలసి వస్తుంది. నలుగురు ముందు తలవంచాల్సి వస్తుంది. ఇందుకు ఎవరూ అతీతం కాదు. తాజాగా వ్యాక్యాల తాలుకూ పర్యవసానాలను ఓ మంత్రి స్వయంగా అనుభవిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్ల చేతిలో విపరీతంగా ట్రోల్ కు గురవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.
రాజస్థాన్ తెలుసు కదా.. దేశంలోనే అత్యంత శుష్కమైన వాతావరణం కలిగి ఉన్న రాష్ట్రం. విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ అక్కడ పంటలు పండేది మాత్రం చాలా తక్కువ. ఎడారి ప్రాంతం ఎక్కువ. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పాలిస్తోంది. మొన్నటిదాకా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య ప్రచ్చన్న యుద్ధం కొన సాగింది. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వాతావరణం కూడా వేడెక్కింది. అయితే దానిని చల్లబరచాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఆ రాష్ట్ర మంత్రి ఒకరు తలా తోకా లేని వ్యాఖ్యలు చేశారు. అది కూడా చంద్రయాన్ ప్రయోగం మీద.
సాధారణంగా చంద్రుడి ఉపరితల మీద అత్యంత దుర్భేద్యమైన వాతావరణం ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా తక్కువ. అక్కడ ఎలాగూ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మనుషులు వెళ్లడం అసాధ్యం. ఒకవేళ వ్యోమగాములు వెళ్ళినప్పటికీ వారు ఆక్సిజన్ సహాయంతోనే చేయాల్సిన పనులు చక్కబెట్టుకుని వస్తారు. అంతేగాని అక్కడే ఉండిపోరు. మరి ఈ మాత్రం లోకజ్ఞానం తెలియని రాజస్థాన్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ అశోక్ చంద్ర యాన్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో “చంద్రయాన్ సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందులో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నా. సైన్స్ స్పేస్ రీసెర్చ్ లో మన దేశం మరింత ముందుకు వెళ్ళింది. భారతీయులందరికీ శుభాకాంక్షలు” అంటూ మంత్రి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు కావడంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి. దీంతో స్పందించిన నెటిజన్లు మంత్రిని ఒక ఆట ఆడుకుంటున్నారు. మంత్రికి కనీసం అవగాహనలేదని, అందులో యాత్రికులు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే చంద్రయాన్ మీద వివాదాస్పద ట్విట్ చేసి ప్రకాష్ రాజ్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు రాజస్థాన్ మంత్రి అశోక్ చంద్ర ఆ జాబితాలోకి చేరాడు.
STORY | “I salute the passengers”
Rajasthan minister makes a slip, congratulates ‘passengers’ on Chandrayaan mission
READ: https://t.co/NMLYVYI1wB
VIDEO: pic.twitter.com/0GQ1XsO2rt
— Press Trust of India (@PTI_News) August 23, 2023