Salman Khan- Pooja Hegde: చిత్ర పరిశ్రమలో రూమర్స్ వెరీ కామన్. ఒక హీరో హీరోయిన్ వరుసగా రెండు చిత్రాలు చేస్తే చాలు ఎఫైర్స్ అంటగడతారు. అలా అని ప్రచారమయ్యే ప్రతి వార్త అబద్ధమని కాదు. కొన్ని నిజాలు కూడా ఉంటాయి. కొందరు స్టార్స్ ప్రేమాయణం నడుపుతూ ఉంటారు. కొద్దిరోజులుగా ఒక న్యూస్ బాలీవుడ్ ని ఊపేస్తోంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న తరుణంలో వివాదాస్పద క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ వేశాడు.

సల్మాన్-పూజా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇద్దరూ రహస్యంగా విందులు విహారాల్లో పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థలో పూజా హెగ్డే రెండు చిత్రాలకు సైన్ చేశారంటూ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో మీడియాలో ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున కథనాలుగా ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్-పూజా కాంబినేషన్ లో ‘కిసీ కా జాన్ కిసీ కి భాయ్’ చిత్రం రూపొందుతుంది. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
ఈ మూవీ సెట్స్ లోనే పూజా-సల్మాన్ మధ్య ప్రేమ చిగురించింది అనేది కథనాల సారాంశం. ఈ వార్తలపై సల్మాన్ సన్నిహితుడు స్పందించాడు. ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. కేవలం పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి నిరాధార వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. సల్మాన్ కి పూజా హెగ్డే కూతురు లాంటిది. కలిసి సినిమాలు చేసినంత మాత్రాన అఫైర్స్ అంటగడతారా. ఇంత బాధ్యతారాహిత్యం వార్తలు రాసేవారు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది మూర్ఖుల చర్య. ఎఫైర్ వార్తలు చిన్న విషయం కాదు.. అని ధ్వజమెత్తారు.

సల్మాన్ సన్నిహితుడు సమాచారం మేరకు పూజా-సల్మాన్ ఎఫైర్ పూర్తిగా అవాస్తవం. సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ అనగానే జనాలు నమ్మేస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. సోమీ అలీ నుండి కత్రినా కైఫ్ వరకు అధికారికంగా అరడజనుకు పైగా హీరోయిన్స్ తో సల్మాన్ అఫైర్స్ నడిపారు. ఈ 57 ఏళ్ల హీరోపై ఇంకా ఎఫైర్ వార్తలు రావడం చెప్పుకోదగ్గ అంశం. ఆయన వివాహం చేసుకోకపోవడం కూడా ఇలాంటి రూమర్స్ కి ఊతం ఇస్తున్నాయి. మరోవైపు పూజా సల్మాన్ చిత్రంతో పాటు రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ మూవీ చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇక మహేష్-త్రివిక్రమ్ మూవీ షూట్ లో త్వరలో జాయిన్ కానున్నారు.