
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా అది చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. తాజాగా సల్మాన్ ఖాన్ తన పాత సినిమాలోని ఓ ముద్దుసీన్ ట్వీటర్లో పోస్టు చేశాడు. దీనిని చూసిన నెటిజన్లంతా సల్మాన్ ఖాన్ హ్యూమరస్ కు ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్ మూములూగానే చాలా హ్యుమరస్ గా ఉంటాడు. కొన్ని విషయాల్లో అన్ని విషయాలను చాలా లైట్ తీసుకుంటాడు సల్మాన్. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న సల్మాన్ కరోనా టైంలో ముద్దుసీన్ తీస్తే ఎలా ఉంటుందో ఎలా అభిమానులకు షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
1989సంవత్సరంలో సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘మైనే ప్యార్ కియా’ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ టాలీవుడ్లో ‘ప్రేమ పావురాలు’ పేరుతో రిలీజై మంచి విజయం దక్కించుకుంది. ఈ మూవీలోని ఓ సీన్ ను ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా మరో సినిమాలోని సీన్‌తో సల్మాన్ సరిపోల్చడం విశేషం. ‘ఈ సీన్లో అద్దంపై హీరోయిన్ కిస్ పెట్టిన పెదాల ముద్ర ఉంటుంది.. అప్పటి చిత్రంలో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ ఆ ప్లేస్‌లో హీరోయిన్‌ను తలుచుకుంటూ ఆ ముద్రపై ముద్దు పెడతాడు. ఇదే సీన్ ప్రస్తుతం చేయాల్సి వస్తే.. హీరో ఏం చేస్తాడు.. అన్నది ఈ వీడియో చూపించాడు సల్మాన్. హీరో ఆ అద్దంలోని హీరోయిన్ పెదాల ముద్రను చూసి సానిటైజ్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేస్తాడు.
కరోనా టైంలో ‘మైనే ప్యార్ కియా’ మూవీ తీస్తే ఇలా ఉంటుందని సల్మాన్ క్వాప్షన్ కూడా పెట్టారు. అలాగే ‘హ్యాపీ ఈస్టర్’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. స్టే ఫోకస్సడ్ స్టే హోమ్ అని మెసేజ్ ఇచ్చాడు సల్లూ భాయ్. కాగా ‘మైనే ప్యాయ్ కియా’ మూవీ సల్మాన్ కెరీర్లో ఓ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్నీ నేటికి ఆల్ టైం హిట్స్ లో చోటు దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
https://www.instagram.com/tv/B-4BIKDF-Lp/