https://oktelugu.com/

Salaar making video : మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ మేకింగ్ వీడియో… ఆ భారీ ఫైట్స్ ఎలా తీశారో చూడండి!

ప్రభాస్ చేరుకోవాల్సిన లక్ష్యం ఇంకా భారీగానే ఉంది. అత్యధిక ధరలకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దదిగా ఉంది. నేడు క్రిస్మస్ కాగా సలార్ కి కలిసొచ్చే అంశం

Written By: , Updated On : December 25, 2023 / 03:49 PM IST
Follow us on

Salaar making video : ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్లు రికార్డు స్థాయిలో రాబడుతుంది. ఈ ఏడాదికి హైయెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు సలార్ వసూలు చేసింది. ఇక మూడు రోజుల్లో రూ. 402 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. మూడో రోజు ఆదివారం సలార్ వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. సెకండ్ డే కి మించిన కలెక్షన్స్ వచ్చాయి.

అయినప్పటికీ ప్రభాస్ చేరుకోవాల్సిన లక్ష్యం ఇంకా భారీగానే ఉంది. అత్యధిక ధరలకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దదిగా ఉంది. నేడు క్రిస్మస్ కాగా సలార్ కి కలిసొచ్చే అంశం. అలాగే జనవరి 1 వరకు జనాలు ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. వసూళ్ళు నిలకడగా ఉండే అవకాశం కలదు.

కాగా సినిమాపై హైప్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సలార్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సలార్ మూవీలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా తెరకెక్కించారో చూపించారు. సలార్ మేకింగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా కష్టపడ్డారని మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. భారీ సెట్స్, ఫైటర్స్, వాహనాలు వాడారు.

సలార్ మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి ఖని బొగ్గు గనుల్లో కొంత జరిగింది. చాలా వరకు సెట్స్ లో పూర్తి చేశారు. హైదరాబాద్ లోనే సలార్ షూటింగ్ జరిగింది. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన సలార్ మేకింగ్ వీడియో గూస్ బంప్స్ కలిగించింది. సలార్ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. శృతి హాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబీ సింహ కీలక రోల్స్ చేశారు.

Making Video of Salaar CeaseFire | Prabhas | Prithviraj | Prashanth Neel | Hombale Films