
Shakuntalam Release Date: కెరీర్లో మొదటిసారి సమంత మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక పాత్ర శాకుంతలం జీవితకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. విడుదలైన ప్రోమోలు ఆసక్తి రేపాయి. యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. శాకుంతలం మూవీలో ప్రతి సన్నివేశం విజువల్స్ లో కూడుకొని ఉంటుంది. ఈ క్రమంలో చాలా కాలంగా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద పని చేస్తున్నారు. ఈ కారణంతో శాకుంతలం రెండు సార్లు వాయిదా పడింది.
శాకుంతలం 2022 చివర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. నవంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. అప్పటికి మూవీ సిద్ధం కాలేదు. దీంతో విడుదల వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఫిబ్రవరి 17న థియేటర్స్ లోకి వస్తున్నట్లు తెలిపారు. సమంత ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా తూచ్ అంటూ నిరాశపరిచారు. ఫిబ్రవరిలో మూవీ రావడం లేదు. వాయిదా పడింది, దానికి చింతిస్తున్నాం అంటూ నోట్ పోస్ట్ చేశారు.
తాజాగా మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. సమ్మర్ ని టార్గెట్ చేసిన చిత్ర యూనిట్ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. రెండుసార్లు వాయిదాపడిన నేపథ్యంలో ఈసారి కచ్చితంగా మేకర్స్ మాట నిలబెట్టుకుంటారని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా శాకుంతలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక రోల్ చేస్తున్నారు. మలయాళ నటుడు మోహన్ దేవ్ శకుంతల భర్త దుష్యంతుడు పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా విజయం టీమ్ కి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సమంత ఫేమ్ మాత్రమే కాపాడాలి. దర్శకుడు గుణశేఖర్ ని ఈ జనరేషన్ మర్చిపోయి చాలా కాలమే అవుతుంది. మరోవైపు సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్లో పాల్గొంటున్నారు. త్వరలో విజయ్ దేవరకొండకు జంటగా చేస్తున్న ఖుషీ చిత్ర షూట్ ప్రారంభం కానుంది. శివ నిర్వాణ దర్శకుడిగా ఉన్నారు.
The Love that was forgotten… An unforgettable tale of Love that remains🦢#Shaakuntalam in theatres worldwide on April 14🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth #ShaakuntalamOnApril14 pic.twitter.com/TKFPSPpwEw
— Sri Venkateswara Creations (@SVC_official) February 10, 2023