
NTR -Saif Ali Khan: ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ హిట్టుతో జూనియర్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల డైరెక్షన్లో #NTR30 సినిమా షూటింగ్ లో సీరియస్ గా పాల్గొంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఆవురావురుమంటూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ వేడి తగ్గించేందుకు కొరటాల సైతం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే హిందీ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నారని కొందరు.. అదంతా ఉట్టిదేనని మరొకొందరు పోటీ పడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ చిత్రం యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది.
లేటేస్టుగా ఒక్కసారిగా సైఫ్ అలీఖాన్ #NTR30 సెట్లో ఉన్న ఫొటోలను రిలీజ్ చేసింది. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన సైప్ నేరుగా #NTR30 షూటింగ్ స్పాట్ కు వచ్చారు. వారితో కలిసి ముచ్చటించే ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో సైఫ్ ఈ సినిమాలో నటిస్తున్నాడనడానికి క్లారిటీ ఇచ్చారు. మరి ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తున్నారా? లేక క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నారా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు. ఇన్నాళ్లు సైఫ్ పై వచ్చిన రూమర్లకు చిత్ర బృందం ఒకేసారి ఇలా షాకిచ్చే ఫొటోలు రిలీజ్ చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల టాలీవుడ్ పై బీ టౌన్ స్టార్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. ఏ చిన్న పాత్ర దొరికినా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకుముందు వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవితో కలిసి కండలవీరుడు కాసేపు కనిపించారు. చిన్న పాత్ర అయినా నో చెప్పకుండా నటించారు. టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ కు వెళ్లనుండడంతో హీరోలు అలా ఇంట్రెస్టు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సైఫ్అలీఖాన్ #NTR30 లో నటించడం చూస్తే ముందు ముందు ఇంకెంతమంది తెలుగు సినిమాల కోసం క్యూ కడుతారో చూడాలి.

సైఫ్ అలీఖాన్ ప్రభాస్ తో కలిసి ‘ఆది పురుష్’లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రపై విమర్శలు వచ్చినా సైఫ్ నటనపై మాత్రం మెచ్చుకున్నారు. దీంతో ఆయనకు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని మన డైరెక్టర్లు సైఫ్ వెంట పడుతున్నారు. అయితే సైఫ్ సైతం తెలుగు సినిమా అనగానే ఏమాత్రం నో చెప్పకుండా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో #NTR30 సైఫ్ ఏ పాత్రలో కనిపిస్తాడో చూడాలని అందరూ ఆత్రుత పడుతున్నారు.