Veera Simha Reddy- Sai Madhav Burra: మంచి చేసినా చెడు వెతికి విమర్శించే రోజులు ఇవి. ఇక నేరుగా తిడితే ఊరుకుంటారా. తిట్టినోళ్ల లోపాలు వెతికి కౌంటర్లు ఇస్తారు. బాలయ్య సినిమా అనగానే వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ గా డైలాగ్స్, సీన్స్ ఉంటాయని యాంటీ ఫ్యాన్స్ ఒక అంచనాకు వచ్చారు. ట్రైలర్ తోనే దీనిపై హింట్ ఇచ్చారు. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుమార్పు, డిఎన్ఏ అంటూ పుట్టుకలు పూర్వోత్తరాలు ఎత్తాడు బాలయ్య. సంతకంతో ఎన్టీఆర్ గౌరవాన్ని తగ్గించలేవంటూ సీఎం జగన్ కి సూటిగా బాణాలు సంధించాడు.

ట్రైలర్ లో ఉంది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో సీన్లకు సీన్లు పేజీల కొద్దీ డైలాగ్స్ నింపేశారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ బయటకు వచ్చేశాయి కూడా. ‘అభివృద్ధి అడ్డుపడుతున్నావా?’ అని హోమ్ మిస్టర్ పాత్రదారి అంటే… ‘అభివృద్ధి అంటే కూల్చడం కాదు నిర్మించడం అర్థం తెలుసుకో’ అంటూ… బాలయ్య జగన్ పై వీరవిహారం చేశాడు. ఫక్తు టీడీపీ వర్గాలు ఈ సీన్స్, డైలాగ్స్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో బాలయ్య అభిమానులైన వైసీపీ జనాలు నొచ్చుకుంటున్నారు.
ఇక జగన్ డై హార్డ్ ఫ్యాన్స్ బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు. మర్డర్ అటెంప్ట్ కేసులో నిన్ను కాపాడింది ఆ సంతకమే అంటూ గతాన్ని తవ్వుతున్నారు. ఇంకా దారుణమైన పర్సనల్ అటాక్ కి పూనుకుంటున్నారు. జగన్ అభిమానులను రెచ్చగొట్టేలా ఉన్న పవర్ ఫుల్ పొలిటికల్ సెటైర్స్ సాయి మాధవ్ బుర్రా కలం నుండి జాలువారినవే. అయితే తెరవెనుక నుండి ఆయన జగన్ కి గుచ్చుకునేలా కసి తీరా రాశారు. కానీ డైలాగ్స్ చెప్పేది బాలయ్య కాబట్టి సీఎం జగన్ అభిమానులు ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు.

అసలు బాలయ్య, గోపీచంద్ చెప్పకపోయినా… ఏదో సుచాయిగా రాయమని హింట్ ఇస్తే సాయి మాధవ్ బుర్రా రెచ్చిపోయి రాశాడని ఓ వర్గం అభిప్రాయం. ఈ స్టార్ రైటర్ పొలిటికల్ డైలాగ్స్ వైసీపీ వర్గాల్లో బాలయ్యను మరింత పలచన చేశాయి. ఆయన్ని వ్యక్తిగత విమర్శలకు లోనయ్యేలా చేశాయి. కాదు బాలయ్య కావాలని చెప్పి రాయించుకున్నాడనే మరో వాదన కూడా ఉంది. గోపీచంద్ మలినేని మాత్రం నామమాత్రుడే కావచ్చు. సినిమా డైలాగ్స్, సన్నివేశాలతో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచన ఎవరిదైనప్పటికీ… వైసీపీ వర్గాల వ్యతిరేకతకు, బూతులకు బలవుతుంది బాలయ్యే అంటున్నారు.