విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు అనాలోచితంగా చేసిన కామెంట్స్ చిన్న వివాదానికి కారణమయ్యాయి. గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనే కాన్సెప్ట్ వివరించే క్రమంలో ఆయన మాట తప్పుదోవ పట్టింది. విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలల్లో సంయుక్త నటించారు. అవి మూడు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్… వరుస హిట్స్ కొట్టిన హీరోయిన్స్ ని గోల్డెన్ లెగ్ అంటారు. ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతారు. ప్లాప్స్ పడ్డ హీరోయిన్స్ ని మేకర్స్ పట్టించుకోరు. పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు.
ఈ గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ కాన్సెప్ట్ మీరు ఎలా చూస్తారని అడగ్గా… ఒకింత ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఒక సినిమా విజయంలో, పరాజయంతో అందరికీ భాగం ఉంటుంది. గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని ఆమె కష్టాన్ని కేవలం అదృష్టంగా తీసేయడం సరికాదు. గోల్డెన్ లెగ్ అంటే ఆమెకు అదృష్టం వలెనే విజయాలు దక్కుతున్నాయని. టాలెంట్ లేదని. కాబట్టి ఈ గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ కాన్సెప్ట్ నేను అంగీకరించను అన్నారు.
దీనికి విరూపాక్ష డైరెక్టర్ మరోలా సమాధానం చెప్పారు. సంయుక్తకు వరుసగా హిట్స్ పడ్డాయని గోల్డెన్ లెగ్ అంటున్నారు. కానీ ఆమె వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగింది. అలాంటప్పుడు సంయుక్తను ఐరన్ లెగ్ అనుకోవాలి కదా. అలాంటిదేమి ఉండదు. స్క్రిప్ట్ సెలక్షన్, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే సంయుక్త వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగిందని చెప్పడం ఆమెను నొప్పించింది. సంయుక్త ముఖంలో రంగులు మారాయి. అందరి ముందు ఏం అనలేకపోయారు.
కాగా ఆమె లక్కీ హీరోయిన్ ట్యాగ్ కొనసాగుతుంది. విరూపాక్ష సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు సినిమా బాగుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విరూపాక్ష చిత్రానికి సుకుమార్ కథను అందించారు. దర్శకుడు కార్తీక్ దండు ఆయన శిష్యుడే.