
Rupert Murdoch Marriage: పుట్టేనే ప్రేమా.. పడ గొట్టేనే ప్రేమా.. నిన్న మొన్నటి దాకా పాడిన ఆయన ఇప్పుడు వైరాగ్యంలో మునిగిపోయారు. ఆయన ఎవరో కాదు ఆస్ట్రేలియన్, అమెరికన్ బిలియనీర్, మీడియా మొగల్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్. 92 సంవత్సరాల వయసు ఉన్న ఈయన.. ఐదో చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ పెళ్లికి సంబంధించి నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో ఒక్కటి కావాలి అనుకున్నారు.. కానీ హీరోగా ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి పెళ్లి రద్దయిపోయింది.
మర్దోక్…65 సంవత్సరాల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు నెలలో ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచారు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అయితే ఈ వృద్ధ ప్రేమికులు తమ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. వెస్ట్రన్ మీడియా చెబుతున్న ప్రకారం మర్దోక్, లెస్లీ వివాహ ప్రణాళిక అకస్మాత్తుగా ఆగిపోయింది. లెస్లీ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసహనానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఆగిపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.. అయితే ప్రేమించుకుని, నిశ్చితార్థం చేసుకున్నాక, పెళ్లి చేసుకోవాలనే వీరి నిర్ణయం ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో అది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
అమెరికాలోని న్యూయార్క్ లో మార్చి 17న ఓ హోటల్లో మర్దోక్, లెస్లీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మర్దోక్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ఇది నా చివరి వివాహం అవుతుందని ప్రకటించాడు. నేను మళ్ళీ ప్రేమలో పడి ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటానని ఊహించలేదని పేర్కొన్నాడు. మర్దోక్ నాలుగో భార్య జెర్రీ హాల్ తో విడాకులు తీసుకొని ఏడు నెలలు కూడా పూర్తిగా ముందే మళ్ళీ ప్రేమలో పడటం, నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రి షి యా బుకర్ ను 1956లో పెళ్లి చేసుకున్నాడు. 1967లో వీ రు విడిపోయారు.. అనంతరం అన్నా మారియా మన్ ను పెళ్లి చేసుకున్నాడు. 30 సంవత్సరాల సుదీర్ఘ బంధం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2016లో జెర్రీ హాల్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న ఆరు సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఇక రెండవ భార్యతో విడిపోయిన సందర్భంలో మర్దో క్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. మర్దోక్, స్మిత్ ల వివాహం ఈ వేసవిలో జరగాల్సి ఉండేది.. వివాహమైన తర్వాత అమెరికా, బ్రిటన్ దేశాలలో గడపాలని కొత్త జంట భావించింది.. అయితే తాజాగా ఈ వృద్ధ ప్రేమ జంట పెళ్లిని రద్దు చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వివాహం రద్దు అయ్యేందుకు స్మిత్ కారణమని మర్దోక్ చెప్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వాటన్నింటినీ పెటాకులు చేసుకున్న మర్దోక్ ఎవరి పెళ్లి అయినా సజావుగా సాగాలని, ఈ బంధం మరింత బలోపేతం అవ్వాలని కోరుకున్నాడు. ఒకటి కోరుకుంటే దైవం మరొకటి తలచింది.