https://oktelugu.com/

RRR Trailer Highlights: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?

RRR Trailer Highlights: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రాజమౌళి మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడని ట్రైలర్ చూశాక అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నభూతో నభవిష్యతి అంటున్నారు. ఈక్రమంలోనే ట్రైలర్ లో ఎవ్వరూ ఊహించని రీతిలో పలు అద్భుతాలు కనిపించాయి. వాటిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 1.పులి ఎదురుగా ఎన్టీఆర్ గాండ్రింపు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో కొమురంభీంగా ఎన్టీఆర్ వీరోచితాన్ని అద్భుతంగా రాజమౌలి చూపించాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో పులిని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 / 12:19 PM IST
    Follow us on

    RRR Trailer Highlights: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రాజమౌళి మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడని ట్రైలర్ చూశాక అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నభూతో నభవిష్యతి అంటున్నారు. ఈక్రమంలోనే ట్రైలర్ లో ఎవ్వరూ ఊహించని రీతిలో పలు అద్భుతాలు కనిపించాయి. వాటిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

    RRR Trailer Highlights

    1.పులి ఎదురుగా ఎన్టీఆర్ గాండ్రింపు

    ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో కొమురంభీంగా ఎన్టీఆర్ వీరోచితాన్ని అద్భుతంగా రాజమౌలి చూపించాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో పులిని వేటాడుతూ దాన్ని ఎదురుగా పట్టేసి ఎన్టీఆర్ గాండ్రించే సీన్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు.

    RRR Trailer Highlights

    2.ట్రైయిన్ ను పేల్చేసే రాంచరణ్, ఎన్టీఆర్ స్టంట్

    స్వాతంత్ర్య ఉద్యమకారులను చంపడానికి మందుగుండుతో వెళుతున్న ట్రెయిన్ ను రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి బ్రిడ్జి కింద తాళ్లతో పట్టుకొని వేలాడి దాన్ని నాశనం చేసే సీన్ హైలెట్ అని చెప్పొచ్చు..

    RRR3

    3. అల్లూరిగా రాంచరణ్ విల్లు ఎక్కుపెట్టి..

    అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ మారి బ్రిటీష్ వారిని అదే గెటప్ లో చంపేసే సీన్లు ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. రాంచరణ్ విల్లు ఎక్కుపెట్టి చంపుతున్న సన్నివేశాలు సినిమాకే ప్రాణం పోసేలా ఉన్నాయి.

    RRR NTR

    4. బైక్ ను రౌండుగా తిప్పే ఎన్టీఆర్ స్టామినా

    ఇక బైక్ పై వెళుతున్న రాంచరణ్ ను కింపడేసి ఆ బైక్ ను గాల్లో తిప్పుతూ పట్టేసే ఎన్టీఆర్ సీన్ చూస్తే అందరూ ఆశ్చర్యపోకమానరు. ఇది ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కృతమైంది.

    RRR5

    Also Read: ఫస్ట్ఆఫ్​​ మొత్తం తారక్​.. సెకండ్ ఆఫ్​లో రామ్​ బీభత్సం.. ట్రైలర్​లో రాజమౌళి చెప్పింది ఇదేనా?

    5. కంచెపై చరణ్, ఎన్టీఆర్ ఎక్కే సీన్ హైలెట్
    కంచెపైనుంచి స్వాతంత్ర్య ఉద్యమకారులను చంపుతున్న బ్రిటీష్ సైనికుడిని చంపేందుకు ఎన్టీఆర్, రాంచరణ్ లు ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు పట్టుకొని గాల్లోకి లేచి అదే ఎక్కి చంపే సీన్ చివర్లో గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఈ సీన్ చివర్లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు రాజమౌళి.

    ట్రైలర్ ఇదే

    Also Read: ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం