Homeఎంటర్టైన్మెంట్RRR Postponed: ఆర్ఆర్ఆర్ వాయిదా: తెగ వైరల్ అవుతున్న మీమ్స్

RRR Postponed: ఆర్ఆర్ఆర్ వాయిదా: తెగ వైరల్ అవుతున్న మీమ్స్

RRR Postponed: సినీ ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్ర యూనిట్. మరో వారంలో సినిమా విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఇటీవల వరుసగా ప్రీరిలీజ్ ఈవెంట్లను ఘనంగా నిర్వహించారు. అయితే ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. జనవరి 7న విడుదల కానున్న సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ల నుంచి ఆత్రుతగా వేచి చూస్తున్న అభిమానులకు ఈ వార్త నిజంగా షాక్ లాంటిదే.

RRR Postponed
RRR Team

దేశవ్యాప్తంగా గత పది రోజుల నుంచి కరోనా లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తుండడం.. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దీంతో చిత్రయూనిట్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో మెగా, నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’.. భీమ్లా నాయక్ తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ ను ముంచేసిందా?

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ వాయిదా పడడంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కామెడీతో కూడిన మీమ్స్ నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. సినిమా ప్రారంభంలో యంగ్ ఉన్న ఎన్టీఆర్.. విడుదల అయ్యే సమయానికి ముసలివాడిలా ఉన్న మీమ్ తెగ ఆకట్టుకుంటుంది. అంటే చిత్రం షూటింగ్ ప్రారంభ సమయంలో యువకుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. చిత్రం విడుదలయ్యే సమయానికి ముసలివాడిలా అయిపోతాడేమోనని ఈ మీమ్ అర్థం. అలాగే మరో మీమ్ కూడా తెగ వైరల్ అవుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాలోని డైలాగ్‌ మీమ్స్ రూపంలో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ‘‘ ఎందుకు ఏడుస్తావ్.. కొత్తగా ఏం జరిగింది.. అనుకున్నదేగా జరిగింది’’ అంటూ రాజీవ్ కానకాల చెప్పిన డైలాగ్ ఆర్ఆర్‌ఆర్ సినిమా వాయిదాకు లింక్ చేస్తూ మీమ్ పోస్ట్ చేశారు.

మరోపక్క ప్రస్తుత పాండమిక్ సిచువేషన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా వేయడమే మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు విడుదల సమయానికి థియేటర్లు పూర్తిస్థాయి ఆక్యుపెన్సీలో ఉంటేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని… దీంతో నిర్మాతలకు లాభాల పంట పడుతుందన్న వాదన ఉంది. అయితే ఆర్ఆర్ఆర్‌ను మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. దీంతో సినీ అభిమానులు మరికొంత కాలం వేచిచూడక తప్పదు. దీంతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ను మీరు ఒకసారి చూసేయండి

Also Read: ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్లినా.. భీమ్లా నాయక్ ముందుకు రాలేదు ఎందుకు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version