Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల కిందట బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ విదితమే. ఆ తర్వాత ఆయన రికవరీ అయ్యారు. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలై ప్రశంసలు కూడా పొందింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పరామర్శించాడు. సాయికు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూనే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, కిషన్ రెడ్డి సాయి తేజ్‌ను కలుసుకోవడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అని కొందరు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
ఇకపోతే బిజీ షెడ్యూల్‌లో తననకు కలుసుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రికి సాయి తేజ్ థాంక్స్ చెప్పారు. ఈ ఏడాది ఎంతో గొప్పగా సాగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే యువ సినీ నటుడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలవడం చర్చనీయాంశమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’.. భీమ్లా నాయక్ తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ ను ముంచేసిందా?
సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ పైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ పుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించారు. విచారణ నిమిత్తం సాయిధరమ్ తేజ్‌కు 91 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. బైక్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు అన్ని వివరాలు తమకు సమర్పించాలని సాయిధరమ్ తేజ్‌కు నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తమ నోటీసులకు సాయితేజ్ ఇప్పటివరకు స్పందించలేదని పేర్కొన్నారు. సాయితేజ్ స్పందించిన పక్షంలో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అతనిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మెగా కుటుంబానికి అండగా నిలవాలని కేంద్రమంత్రి ప్రయత్నించారా అని పలువురు చరర్చించుకుంటున్నారు. అయితే, సాయితేజ్ పై చర్యలు తీసుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే బీజేపీతో సాయితేజ్ మేనమామ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: బాలయ్య “అన్ స్టాపబుల్” షో నెక్స్ట్ గెస్ట్ ఎవరో తెలిసిపోయిందోచ్ …